ఇపుడిదే ప్రశ్న కాపు సామాజికవర్గంలో ప్రధానంగా వినిపిస్తోంది. పవన్ వైఖరి ఏంటో అర్ధంకాక సామాజికవర్గంలోని నేతల్లో అయోమయం కనిపిస్తోంది. నిజానికి పవన్ కు ఓ స్పష్టమైన అజెండా ఉందా అన్న అనుమానం వస్తోంది అందరిలోను. ఎందుకంటే ఒక్కోసారి ఒక్కోలాగ వ్యవహరిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం. మొన్నటి ఎన్నికల్లో కేవలం పవన్ వైఖరి వల్లే జనసేన అట్టర్ ఫ్లాన్ అయ్యింది.

 

పవన్ ను పూర్తిగా నమ్మకపోవటంతోనే చివరకు కాపుల్లో మెజారిటి సెక్షన్ జగన్మోహన్ రెడ్డి వైపే మొగ్గు చూపారు. తాను ఏ ఒక్క సామాజికవర్గానికి కొమ్ము కాయటానికో పార్టీ పెట్టలేదని చెప్పటంతోనే  పవన్ కు బాగా డ్యామేజి జరిగింది.  చివరకు ఏ సామాజికవర్గం కూడా పవన్ ను ఓన్ చేసుకోలేదు. అందుకనే జనసేనకు సుమారు 20 లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయి.

 

ఈ నేపధ్యంలోనే వచ్చే ఎన్నికలకు కాపులు అంతా ఏకమై తమ సత్తా ఏంటో చూపాలనే ఆలోచన నేతల్లో మొదలైనట్లు సమాచారం. ప్రస్తుతానికి కాపుల్లోని బహు నాయకత్వమే సామాజికవర్గాన్ని దెబ్బ కొడుతోంది. మొత్తం సామాజికవర్గాన్నంతా నడిపించగలిగే సత్తా ఉన్న నేతైతే కాపుల్లో లేరన్నది వాస్తవం. అందుకనే ఎవరికి తోచినట్లు తలా ఓ పార్టీ పంచన చేరిపోయారు.

 

ఈ పరిస్ధితి మారాలంటే బహునాయకత్వం పోయి ఏక నాయకత్వం రావాలనే ఆలోచన కొందరు నేతల్లో మొదలైందట. అయితే ఆ ఒక్క నాయకుడు ఎవరు అన్నదే పెద్ద సమస్యగా తయారైంది. అందుకనే కాపు నేతల్లో కొందరు పవన్ ను దువ్వుతున్నారట. సామాజికవర్గాన్ని ముందుండి నడిపించగలిగితే అందరూ పవన్ వెంట నడవటానికి సిద్ధంగా ఉన్నారనే సంకేతాలు పంపారట.


పవన్ వైపు నుండి ఇంకా ఏ విధమైన  రెస్పాన్సూ రాలేదని సమాచారం. రెడ్లకు వైసిపి, కమ్మోరికి టిడిపి ఉన్నట్లే కాపులకు జనసేన ఉండాలని పలువురు నేతలు కోరుకుంటున్నారు. ప్రస్తుతానికి చంద్రబాబునాయుడు మాయలో ఉన్న పవన్ దాన్ని చేదించుకుని బయటపడతాడా అన్నదే ప్రశ్న. నిజంగానే పవన్ గనుక మాయ నుండి బయటపడి ఇప్పటి నుండే నికార్సయిన రాజకీయాలు చేస్తే వచ్చే ఎన్నికలకు పెద్ద ఫోర్సు అవుతారేమో చూడాలి.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: