నేతల్లోను కార్యకర్తల్లోను ఆత్మస్ధైర్యం నింపే విషయం ఎన్టీయార్ రూటే సపరేటు. ఎన్నికల్లో ఓటమి ఎదురైనపుడు చంద్రబాబునాయుడులాగ ఎన్టీయార్ ఎప్పుడు కూడా పనికిమాలిన మాటలు మాట్లాడలేదు. మొన్నటి ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయానికి తనదే బాధ్యతగా చెప్పాల్సిన చంద్రబాబు ఎన్ని నాటకాలు ఆడుతున్నారో అందరూ చూస్తున్నదే.

 

టిడిపి ఓటమికి ఒకసారి ఈవిఎంలే కారణమన్నారు. మరోసారి కెసియార్ అందించిన వేల కోట్లతో వైసిపి జనాలను మాయ చేసిందన్నారు. జగన్ అడిగిన ఓక్కసారి ఛాన్స్ బాగా వర్కవుటవ్వటంతో జనాలు ఓట్లేసినట్లు మరోసారి చెప్పారు. చివరకు వైసిపికి ఓట్లేసిన జనాలదే తప్పంతా అని తేల్చేశారు. తమ ఓటమికి ఇప్పటికీ  సాకులు వెతుకుతున్నారే కానీ తన చేతకాని తనం వల్లే పార్టీ ఓడిపోయిందని అంగీకరించటానికి మాత్రం ఇష్టపడటం లేదు.

 

చంద్రబాబుకు మొదటి నుండి ఓ లక్షణముంది. మంచి జరిగితే తన గొప్పతనం వల్లే జరిగిందంటారు. అదే నెగిటివ్ రిజల్ట్ రాగానే ఎదుటి వాళ్ళదే తప్పంతా అంటూ తప్పించుకుంటారు. ఇదంతా ఎందుకంటే, పల్నాడులో వైసిపి బాధుతుల శిబిరం అంటూ హడావుడి చేస్తున్న చంద్రబాబుకు ఎన్టీయార్ తో పోలిక పెడుతూ ఎల్లోమీడియా ఓ కథనాన్ని అచ్చేసింది.

 

1989లో టిడిపి ఓడిపోయినపుడు కూడా నేతలు, కార్యకర్తలపై దాడులు జరిగాయట. అప్పట్లో నేతలు, కార్యకర్తల్లో ఆత్మస్ధైర్యం నింపటానికి ఎన్టీయార్ రంగంలోకి దిగేశారట. గొడవలు జరిగిన గ్రామాల్లో తిరిగారట ఎన్టీయార్. అలాగే ఇపుడు చంద్రబాబు కూడా రంగంలోకి దిగుతున్నట్లు ఎల్లోమీడియా ప్రొజెక్టు చేస్తోంది. నిజానికి ఎన్టీయార్ కున్న ధైర్యంలో చంద్రబాబు పదోవంతు కూడా లేదు. ఎన్టీయార్ ఏం చేసినా నేరుగా చెప్పే చేసేవారు. చంద్రబాబుదేమో ఎప్పుడూ దొడ్డిదారే.


ప్రత్యర్ధిని ఢీ కొనాలంటే నేరుగానే ఢీ కొట్టేవారు. కానీ చంద్రబాబు మాత్రం ఎప్పుడు వెన్నుపోటే. ఎన్టీయార్ ఎక్కడైనా పర్యటిస్తున్నారంటే అప్పట్లో జనాల్లో, పార్టీ నేతలు, కార్యకర్తల్లో మంచి ఉత్సాహం కనబడేది. అదే చంద్రబాబు వస్తున్నారంటే ఏదో మొక్కబడిగా కనబడుతున్నారు. కాబట్టి ఏ విషయంలోను ఎన్టీయార్-చంద్రబాబు మధ్య పోలికే లేదు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: