జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబునాయుడు కావాలనే రెచ్చగొడుతున్నట్లు అనిపిస్తోంది. వాళ్ళ మీద వీళ్ళ మదా కాదు దమ్ముంటే ముందు తనపైనే కేసు పెట్టాలంటూ చంద్రబాబు పదే పదే ఎందుకు సవాలు చేస్తున్నారు ? నిజానికి ప్రత్యర్ధులను సవాలు చేసి ఎదుర్కొనేంత ధైర్యం చంద్రబాబుకు  లేదని అందరికీ తెలిసిందే. ప్రత్యర్ధిని నేరుగా ఏనాడూ ఎదుర్కునింది లేదు.

 

అలాంటి చంద్రబాబు ఇపుడు నేరుగా జగన్నే సవాలు చేస్తున్నారంటే కచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. మొన్నటి ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయం తర్వాత నేతలు ఒక్కరొక్కరే పార్టీని వదిలేసి వెళ్ళిపోతున్నారు. చంద్రబాబు నాయకత్వం మీద, పార్టీ భవిష్యత్తు మీద నమ్మకం లేకే టిడిపిని వదిలేస్తున్నారు. పార్టీ నుండి ఎప్పుడెవరు వెళిపోతారో తెలీని అయోమయంలో చంద్రబాబు, చినబాబు ఉన్నారు.

 

 ఏదో ఒకటి చేయకపోతే ఇటు జనాలూ నమ్మేట్లు లేరు. అదే సమయంలో టిడిపి నుండి వలసలు కూడా ఆగేట్లు లేవు. అందుకనే  వైసిపి బాధితుల కోసం భరోసా శిబిరాల పేరుతో నానా హడావుడి చేస్తున్నారు. అయినా పార్టీలో సీనియర్ నేతల నుండి పెద్దగా స్పందన కనబడటం లేదు. దాంతో ఏం చేయాలో అర్ధంకాక నానా అవస్తలు పడుతున్నారు.

 

అందుకనే జగన్ తో ముఖాముఖి తలపడటమే ఉత్తమ మార్గమని బహుశా చంద్రబాబుకు సలహా ఇచ్చుంటారు. ఎలాగూ చంద్రబాబు మీద అవినీతి ఆరోపణలున్నాయి. తొందరలోనే చంద్రబాబుకు జైలు ఖాయమంటూ బిజెపి నేతలు, వైసిపి నేతలు ఒకటే టెన్షన్ పెట్టేస్తున్నారు. ఈ సమయంలోనే జనాల్లో సింపతి వస్తే కానీ పార్టీకి భవిష్యత్తు లేదని చంద్రబాబుకు అర్ధమైపోయింది.

 

అవినీతి కేసుల్లో  జైలుకు వెళ్ళటం కన్నా ప్రభుత్వంపై ఆందోళనలు చేస్తు కేసులో ఇరుక్కుని జైలుకు వెళ్ళటమే మంచిదని అనుకుంటున్నట్లున్నారు. అందుకనే పదే పదే జగన్ ను రెచ్చగొట్టి తనపై కేసు నమోదు చేయమంటూ కవ్విస్తున్నారు. 70 ఏళ్ళ వయస్సులో చంద్రబాబును జగన్ జైల్లో పెట్టించారనే సింపతినీ చంద్రబాబు కోరుకుంటున్నట్లున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: