తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఢీ కొట్టే సమర్ధుడైన నాయకుడు లేకపోవడం వల్లే బీజేపీ లో చేరేందుకు టీఆరెస్ అసంతృప్త నేతలు వెనుకంజ వేస్తున్నారా? అంటే  అవుననే వాదనే రాజకీయవర్గాల్లో విన్పిస్తోంది . తెలంగాణ బీజేపీ నాయకత్వం బలహీనంగా ఉండడమే కాకుండా , పార్టీ లో చేరిన ఇతర పార్టీల నేతలను రాజకీయంగా ఎదగకుండా, ఆ పార్టీ నేతలు  అడ్డుకుంటారనే  ఆరోపణలు విన్పిస్తున్నాయి . ఈ సందర్బంగా మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఉదంతాన్ని రాజకీయపరిశీలకులు ప్రస్తావిస్తున్నారు . టీడీపీ ను వీడి తెలంగాణ సాధన కోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసిన నాగం జనార్దన్ రెడ్డి,  అనంతరం  బీజేపీ లో చేరిన విషయం తెల్సిందే .


 బీజేపీ లో చేరిన తరువాత  కేసీఆర్ ప్రభుత్వం పై నాగం నిరంతరం  పోరాటం చేశారు . అయితే ఆయనకు పార్టీ పరంగా పెద్దగా సహకారం లభించలేదన్నది జగమెరిగిన సత్యం . ఇక చేసేది లేక,  కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఆయన ప్రెస్ మీట్లు సైతం పార్టీ కార్యాలయం లో కాకుండా , బయట మరొకచోట పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది . దాంతో ఇటీవల జరిగిన ఎన్నికల ముందు నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు . లోక్ సభ ఎన్నికల అనంతరం  కాంగ్రెస్, టీడీపీ లకు చెందిన  పలువురు నేతలు బీజేపీ లో చేరారు .


దీనితో  తెలంగాణ లో బీజేపీ బలం పుంజుకుంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి . అయినా టీఆరెస్ కు చెందిన అసంతృప్త నేతలు మాత్రం , బీజేపీ లో చేరేందుకు  సాహసించడం లేదు. దానికి కారణం ... రాష్ట్ర స్థాయి లో  కేసీఆర్ సమర్ధవంతంగా ఎదుర్కొనే నాయకత్వం లేకపోవడం, బీజేపీ లో చేరితే తమ రాజకీయ భవిష్యత్తు కు గ్యారంటీ లేకపోవడమేనని తెలుస్తోంది .


మరింత సమాచారం తెలుసుకోండి: