హిమాచల్ ప్రదేశ్‌లో వరుస భూప్రకంపనలో భయంతో ప్రజలు వణికిపోతున్నారు. ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా ఈ భూకంపాలు అల్జీ సృష్టిస్తున్నాయి. హిమచల్ ప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుల్లో జిల్లా అయినా చంబా జిల్లాలో మొదటిసారి ఆదివారం రాత్రి భూకంపం రాగా, రెండొవసారి అదే రోజు అర్ధరాత్రి భూప్రకంపన సంభవించినట్టు ఐఎన్‌డీ డైరెక్టర్ మన్మోహన్ సింగ్ తెలిపారు.                                         


అనంతరం సోమవారం మధ్యాహ్నం ఒకేసారి మూడు సార్లు భూమి కంపించింది అని తెలిపారు. భూప్రకంపన తీవ్రత రిక్టరు స్కేలుపై సోమవారం వరుసగా 5.0, 3.8, 2.5 గా నమోదయ్యింది. ఈ భూప్రకంపనలతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్ట జరగలేదు కానీ వరుస భూ ప్రకంపనల వల్ల మళ్ళి భూప్రకంపనలు వస్తాయి ఏమో అని ప్రజలు భయంతో వణికిపోతున్నారు.                                                    


అయితే ఈ భూప్రకంపనల వల్ల ఎవరికి ప్రాణనష్టం జరగలేదని, ఈ భూప్రకంపనలు చిన్నవి అని ఎవరికి ఎలాంటి హాని జరగదు అని హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు ధైర్యం చెప్పారు ఐఎన్‌డీ డైరెక్టర్ మన్మోహన్ సింగ్. మరి ఈ అయుదు భూ ప్రకంపనలతో ఆగిపోతాయా లేక మరి పెద్ద భూప్రకంపనలు వస్తాయా అనేది ఐఎన్‌డీ వరుకు కూడా ఇంకా తెలపలేదు.                              


మరింత సమాచారం తెలుసుకోండి: