డబ్బున్నవారి ప్రాణానికి ఎలాగైన రక్షణదొరుకుతుంది,కాని వచ్చినబాధల్లా పేదవారికే.అనారోగ్యంవస్తే గవర్నమెంటు హస్పిట ల్స్ తప్ప ప్రైవేట్ హస్పిటల్లో చూపించుకునే స్దోమత వారికి వుండదు అందుకనే ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వకున్నా అక్కడికే పరిగెడతారు.ఇక ఇలాంటి హస్పిటల్లో జరిగే అవినీతికి అంతేవుండదు. దోచుకున్నవాడికి దోచుకున్నంతా.ఎవరు ఎంతగా దోచుకున్న అది పేదవాడి కష్టార్జితమే వారినుండి దోచుకుని వారి ప్రాణాలతోనే ఆటలాడుతుంటారు.ఇలాంటి సంఘటనలు చాలా కనిపిస్తుంటాయి.ఇప్పుడు రుయా హస్పిటల్లో జరుగుతుందదేనట.రుయా ఆస్పత్రి అధికారులపై అవినీతి ఆరోపణలు రావడంతో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి రుయా ఆస్పత్రిలో సోమవారం పర్యటించిన సందర్భంగా అక్కడి పరిస్దితులను చూసి ఆగ్రహన్ని వ్యక్తం చేసారు.



గత ప్రభుత్వ హయాంలో నిధులను అడ్డంగా దోచుకుని,‘రాయలసీమకే తలమానికమైన రుయా ఆస్పత్రిని పూర్తిగా భ్రష్టు పట్టించారని,ఇక ఇప్పటినుండి మీ ఆటలు అటకమీద పెట్టి ఆస్పత్రి నిర్వహణలో మార్పు తీసుకురండి.అలాజరగని పక్షంలో అధికారులపై తగిన చర్యలు తీసుకోవడం గ్యారంటని హెచ్చరించారు.ఇప్పటికే ఆస్పత్రిలో,కే ట్యాక్స్‌ వ్యవహారం వెలుగులోకి రావడంతో,హస్పిటల్ సూపరింటెండెంట్‌ను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందని,ఆస్పత్రి అధికారులను హెచ్చరించారు.ప్రభుత్వం మారిన అవినీతి తిమింగలం కోడెలతనయుడు కనుసన్నల్లో నడుస్తున్న ప్రైవేట్‌ ల్యాబ్‌ను రద్దు చేయాలని ఆదేశించినా స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ,రోగులకు అన్యాయం చేస్తూ అక్రమార్కులకు మేలు చేసేలా వ్యవహరిస్తారా? అంటూ నిలదీశారు.



ఇక జరిగిన అవినీతి చాలు దీనికి ముగింపు పలికి పేద రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.ఇప్పటికే మీడియాలో రుయా అవినీతిపై ఆరోపణలు వెల్లువెత్తుచున్న నేపధ్యంలో,దీనిపై అధికారుల్లో చలనంలేకపోవడం బాధాకరమని, పేద రోగులకు మెరుగైన వైద్యాన్ని అందించాల్సిన గత పాలకులు రుయా వేదికగా దోపిడీకి పాల్పడ్డారని, నిలదీశారు.ఇప్పటికే సెంట్రల్‌ ల్యాబ్‌ నిర్వహణను,మెడికల్‌ కళాశాల రుయా సంయుక్తంగా నిర్వహిస్తూ,జనరిక్‌ మందుల షాపులను తొందరగా  కేటాయించాలని వచ్చిన ఆదేశాలకు అధికారులు స్పందించకపోవడం దుర్మార్గమన్నారు.ఇకనైన అవినీతి పనులు మానుకుని నీతిగా బ్రతకడం నేర్చుకుంటే చాల మంచిదని లేకుంటే ఉద్యోగాలు కోల్పోవలసి వస్తుందని హెచ్చరించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: