ఇస్రో... ఇండియా సూపర్ పవర్.. రాకెట్ల ప్రయోగంలో ఇండియా ప్రపంచదేశాల సరసన నిలిచింది.  అందులో సందేహం అవసరం లేదు.  రోదసీలోకి రాకెట్లను విజయవంతం పంపించగలుతున్న దేశాలు 12 మాత్రమే ఉన్నాయి.  అందులో ఇండియా కూడా ఒకటి.  మొదటి ఐదు ఆరు స్థానాల్లో ఇండియా ఉన్నది.  వరసగా అంతరిక్ష ప్రయోగాలు చేస్తూ.. వరసగా రాకెట్లను ప్రవేశపెడుతూ.. ఇస్రో తన సత్తా చాటుతున్నది.  ఇప్పటికే ఎన్నో ఉపగ్రహాలను రోదసీలోకి ప్రవేశపెట్టింది.  


ఒకప్పుడు విదేశాల సహాయంతో ఉపగ్రహాలను ప్రవేశపెట్టిన ఇండియా ఇప్పుడు ఆ ఆ అవసరం లేకుండానే ఉపగ్రహాలను ప్రవేశపెడుతుంది.  అంతేకాదు.. వివిధ దేశాల ఉపగ్రహాలను రోదసీలోకి ప్రవేశపెడుతూ.. ఆదాయం ఆర్జిస్తోంది.  గతేడాది ఇండియా 104 ఉపగ్రహాలను ఒకేసారి రోదసీలోకి ప్రవేశపెట్టి రికార్డు సాధించింది.  ఈ ప్రయోగం ద్వారా సగానికిపైగా ఆదాయం పొందింది.  తక్కువ ఖర్చుతో చేస్తున్న ప్రయోగాలు .. ఎక్కువ సక్సెస్ అవుతున్న ప్రయోగాలు ఇవే.  


ఇక ప్రస్తుతం అంతరిక్ష మార్కెట్ విలువ 350 బిలియన్ డాలర్లు.  2025 నాటికీ ఇది మరింత పెరిగి 550 బిలియన్ డాలర్లుగా అయ్యే ఆవకాశం ఉన్నది.  ఈ మార్కెట్లో 10%వాటాను ఇస్రో దక్కించుకోవాలని చూస్తున్నది.  దీనికోసం పీఎస్ఎల్వి, జిఎస్ఎల్వి రాకెట్లతో పాటు స్మాల్ శాటిలైట్  లాంచ్ వెహికల్స్ ను కూడా సిద్ధం చేస్తున్నది ఇస్రో.  2019 చివరినాటికీ ఇవి రెడీ కాబోతున్నాయి.  ఇవి ఇవి రెడీ అయినా తరువాత చిన్న చిన్న ఉపగ్రహాలను రోదసీలోకి ప్రవేశపెట్టేందుకు వీలవుతుంది.  2030 నాటికి 17,000లకు పైగా చిన్న ఉపగ్రహాలు రోదసీలోకి ప్రవేశిస్తాయని అంటున్నారు.  ఆదాయం వీటిద్వారానే ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.  


అందుకే ఆదాయాన్ని తీసుకొచ్చే ఈ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ ను రెడీ చేస్తున్నది.  చంద్రయాన్ 2 విషయంలో పాక్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఫవాద్ చేసిన వ్యాఖ్యలు ఇదే సరైన సమాధానం కావొచ్చు.  ఇంతలా ఇండియాపై రుసరుసలాడుతున్న పాక్ ఇప్పటి వరకు సొంతంగా ఎన్ని ఉపగ్రహాలు ప్రవేశపెట్టిందో తెలుసా.. ఒక్కటంటే ఒక్కటే... 1990లో బ్రదర్ 1 అనే ఉపగ్రహాన్ని రోదసీలోకి ప్రవేశపెట్టింది.  ఆ తరువాత సొంతంగా ఆ దేశం ఒక్క ఉపగ్రహాన్ని కూడా ప్రవేశపెట్టలేదు. స్పేస్ ఏజెన్సీ కోసం పాక్ ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ కేవలం 43 మిలియన్ డాలర్లు.  అంటే చంద్రయాన్ 2 ప్రయోగానికి ఇండియా ఖర్చు చేసినదానికంటే చాలా తక్కువ.  స్పేస్ టెక్నాలజీ విహాయంలో పాక్ వ్యవహారం ఇలా ఉన్నది.  ఆ దేశం కూడా ఇండియా గురించి మాట్లాడుతున్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: