గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి.  వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో వరదనీటిని మహారాష్ట్ర నుంచి కిందకు జోరుగా ప్రవరిస్తోంది.  అక్కడ డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో.. కిందకు పరుగులు తీస్తూ వస్తున్న కృష్ణమ్మ శ్రీశైలం డ్యామ్ కు చేరుకుంది.  శ్రీశైలం డ్యామ్ కు వరదనీరు భారీగా చేరింది.  వరదనీరు భారీగా చేరడంతో.. డ్యామ్ ఆరు గేట్లను 17 అడుగులమేర ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు.  


అయితే, అయితే, డ్యామ్ పూర్తిగా నిండటంతో.. 2,3,10,11,12 గేట్ల మీదనుంచి నీరు ప్రవహించింది.  ఇలానే కాసేపు ప్రవహిస్తే డ్యామ్ గేట్లకు ప్రమాదం ఉంటుందని గమనించిన అధికారులు ఆ గేట్లను సరిచేశారు.  సమయానికి గుర్తించకపోయి ఉంటె భారీ ప్రమాదం జరిగేది.  ఈ సమయంలో గేట్లకు ఏదైనా ప్రమాదం జరిగేతే జరిగే నష్టం అంతాఇంతా కాదు.  డ్యామ్ దగ్గర అధికారులు నిత్యం అందుబాటులో ఉంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నారు.  


డ్యాం పూర్తిస్తాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884.90 అడుగులు నమోదైంది.  చాలా కాలం తరువాత వరసగా జలాశయం నిండుకుండలా కనిపిస్తున్నది.  ఈ జలాశయానికి 3.49 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుంటే.. 3.55 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు.  శ్రీశైలం నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల పధకానికి 2,400క్యూసెక్కులు, హాంద్రీనీవాకు 2,026క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడుకు 28,500క్యూసెక్కులు కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలకు 80 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.  


దీంతో పాటు శ్రీశైలం డ్యాం నుంచి 6 గేట్ల ద్వారా నీటికి కిందికి వదులుతున్న సంగతి తెలిసిందే. శ్రీశైలం నుంచి కృష్ణమ్మ ఉరకలు వేస్తూ పరుగులు తీస్తూ నాగార్జున సాగర్ వైపు వస్తున్నది.  వరదనీరు సాగర్ కు వస్తుండటంతో.. సాగర్ కు సంబంధించిన 14 గేట్లను 10 అడుగులమేర ఎట్టి నీటిని కృష్ణా బ్యారేజ్ వైపు పంపిస్తున్నారు.  ఎగువున మరికొన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో.. శ్రీశైలానికి వరదనీరు మరింతగా వచ్చిచేరే అవకాశం ఉన్నది.   


మరింత సమాచారం తెలుసుకోండి: