అన్ని స‌మ‌యాల్లోనూ రాజ‌కీయాలు చేస్తామంటే బాగుంటుందా ? ఏమైనా అర్ద‌ముంటుందా ?  కానీ, టీడీపీ వాళ్ల‌ను చూస్తే.. మాత్రం ప‌రిస్థితి దీనికి భిన్నంగా ఉంది. స‌మ‌యం సంద‌ర్బం కాక‌పోయినా.. కూడా సెంటి మెంటు కోసం పాకులాడుతున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌జ‌ల‌కు ఆక‌ర్షించేందుకు ప్ర‌తి పార్టీ కూడా త‌మ త‌మ కోణాల్లో ప్ర‌చారం చేస్తుంది. డిజిట‌ల్ మీడియా నుంచి అన్ని మాధ్య‌మాల‌ను వినియోగించుకుంటుం ది. ఈ విష‌యంలో టీడీపీ కూడా ముందు వ‌రుస‌లోనే ఉంది. ఏ సెంటిమెంట్‌కు ఎవ‌రు ఎలా ప‌డిపోతార‌నే విష‌యాల‌ను ముందుగానే లెక్క‌లు వేసుకుని మ‌రీ ముందుకు సాగింది.


ఈ క్ర‌మంలో సినిమా ద‌ర్శ‌కుల‌ను కూడా రాజ‌కీయాల్లో కీల‌క రోల్ పోషించారు. ప్ర‌తి ఒక్క విష‌యాన్ని నిశి తంగా గ‌మ‌నించి.. ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునేలా యాడ్స్ రూపొందించారు. ముఖ్యంగా అప్ప‌టి సీఎం చంద్ర బాబుకు అనుకూలంగా కొంద‌రు ద‌ర్శ‌కులు భారీ ఎత్తున ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను రూపొందించి స‌క్సెస్ అయ్యారు. అయితే, ఎన్నిక‌ల్లో జ‌యాప‌జ‌యాలు మామూలే. ఈ క్ర‌మంలోనేచంద్ర‌బాబు పార్టీ ఘోరంగా ఓట‌మి పాలైంది. దీంతో ఆయ‌న ప్ర‌తిప‌క్షానికే ప‌రిమితం అయ్యారు. అయినా కూడా ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బాబుకు సానుభూతిగా.. పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది.


టీడీపీకి చెందిన కొంద‌రు యువ నాయ‌కులు అత్యుత్సాహానికి పోతున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు తీసిన సానుభూతి వీడియోల‌ను ఇప్పుడు కూడా ప్ర‌చారం చేస్తున్నారు. నిజానికి ఇప్పుడు చంద్ర‌బాబు అధికారం లో లేరు... పోనీ ఇప్ప‌ట్లో ఏమైనా ఎన్నిక‌లు ఉన్నాయా? అంటే అది కూడా లేదు. అయినా.. కూడా తెదేపా బ్యాచ్ మాత్రం ఎక్క‌డా ఆగ‌డం లేదు. ఇప్పుడు ఎన్ని సెంటిమెంట్ అస్త్రాలు పేల్చినా.. ఎన్ని సానుభూతి గీతాల‌తో సోక‌ణ్నాలు పెట్టినా.. చంద్ర‌బాబు కానీ, ఆయ‌న పార్టీ కానీ సాధించేది ఏమీలేదు. పైగా ప్ర‌జ‌ల్లో ఏహ్య భావం పెర‌గ‌డం త‌ప్ప‌!! ఈ విష‌యం గ్ర‌హిస్తే.. మంచిద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.


మరింత సమాచారం తెలుసుకోండి: