మాజీ మంత్రి పరిటాలసునీత కూడా రైతులను మోసం చేసిందా ? తాజాగా వెలుగు చూసిన ఘటన ప్రకారమైతే తన నియోజకవర్గంలోని రైతులను సునీత మోసం చేసినట్లే అర్ధమవుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే చంద్రబాబునాయుడు హయాంలో పేదలకు ఇళ్ళ స్ధలాల పంపిణి చేయాలని అనుకున్నది. అనుకున్నట్లే అందుబాటులో ఉన్న ప్రైవేటు స్ధలాలను కొని పేదలకు పంచారట.

 

సీన్ కట్ చేస్తే సరిగ్గా ఇక్కడే మోసానికి తెరలేచింది. రాష్ట్రంలోని మిగిలిన నియోజవర్గాల సంగతి పక్కనపెడితే అనంతపురం జిల్లాలోని రాప్తాడులో కూడా పేదలకు ఇంటి స్ధలాలను పంపిణి చేసింది ప్రభుత్వం. పంపిణీ కోసం రైతుల నుండి పెద్ద ఎత్తున భూములను సేకరించింది లేండి.

 

ఇక్కడ సేకరణ అంటే రైతుల నుండి భూమిని కొనటమే. పేదల పంపిణికి అవసరమైన 13.20 ఎకాలను సేకరించారు. ఇందుకు గాను భూమిని ఇచ్చిన రైతుల్లో ఒక్కొక్కరికి రూ. 29 లక్షల రూపాయలు చెల్లించారు. అంటే ఇచ్చిన డబ్బంతా చెక్కుల రూపంలోనే మార్చి 2వ తేదీన చెల్లించారు లేండి. అంటే రైతులకు చెక్కులు పంపిణి చేశారు. పేదలకు ఇంటి స్ధలాలను పంపిణి చేశారు.

 

అంతా బాగానే ఉందని అనుకుంటున్న సమయంలో రైతులకు ఇచ్చిన చెక్కులు బ్యాంకుల్లో చెల్లలేదు. చెక్కులు ఎందుకు చెల్లలేదంటే ఆ చెక్కులు నకిలీవని తేలిందట. చెక్కుల్లో నకిలీవేమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. మొత్తానికి రైతుల నుండి భూమి వెళిపోయింది. పట్టాల పంపిణీ జరిగిపోయింది. దాంతో రైతులు ఇపుడు లబోదిబోమంటున్నారు.

 

బ్యాంకులు తిరగొట్టిన చెక్కులను తీసుకుని రైతులు రెవిన్యు శాఖ ఉన్నతాధికారులను కలిసినపుడు ఆ చెక్కులు చెల్లని చెక్కులని తీర్మానం చేశారట. అవన్నీ నకిలీ చెక్కులని ఎక్కడా చెల్లవని చెప్పటంతో రైతులకు దిక్కుతోచటం లేదు. అంటే పరిటాల సునీత తమను నకిలీ చెక్కులిచ్చి మోసం చేసిందని రైతులు నెత్తి నోరు మొత్తుకుంటున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: