బాలీవుడ్ నటి ఊర్మిళ మటోండ్కర్ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇటివల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ముంబై నార్త్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైయ్యారు. బీజేపీ అభ్యర్థి గోపాల్ షెట్టి చేతిలో 4 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో అప్పుడే రాజకీయాల నుంచి ఆమె తప్పుకుంటారని ప్రచారం జరిగింది.                         


ముంబయి నగర పార్టీలో కొనసాగుతున్న పార్టీ అంతర్గత విషయాల వల్లే ఆమే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆమే ప్రకటించారు. పార్టీకి దూరంగా ఉంటాను తప్ప రాజీకీయాలను వదలి వెళ్లనని ఆమే స్పష్టం చేశారు. అయితే ఎన్నికల సమయంలోనే ఊర్మిళ మటోండ్కర్ జాతీయ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఆవెంటనే జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ముంబై నార్త్ లోక్ సభ నుండి పోటీ చేశారు.                      


అయితే ఆ ఎన్నికల్లో ఘోరంగా ఓటమిని చెవి చూశారు. ముంబై సిటీ ఇంచార్జ్ అయిన మిలింద్ డియోరాకు ఆమేకు మధ్య రాజకీయ గొడవలు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఆయనపై ఎన్నో ఆరోపణలు చేశారు. అయితే ఆమె ఎన్నికల్లో ఓడిపోయినందుకు ఎప్పుడు బాధ పడలేదని చెప్పారు. కాగా పార్టీకి మాత్రమే ఆమె రాజీనామా చేశానని రాజకీయాలకు మాత్రం దూరంగా ఉండనని స్పష్టం చేశారు.            


కాగా మరికొద్ది రోజుల్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ రాజకీయా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈమె రాజీనామా కూడా అందులో భాగమేనని అంటున్నారు. మరి ఈమె రాజకీయం ఎటు వైపు అనేది తెలియాల్సి ఉంది.          


మరింత సమాచారం తెలుసుకోండి: