మోతీహరి-అమ్లేఖ్‌గంజ్ ఆయిల్ పైప్‌లైన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ, నేపాల్ పిఎం కెపి శర్మ ప్రారంభించారు. ప్రస్తుతం 1973 ఒప్పందం ప్రకారంగా ట్యాంకర్లు పెట్రోలియం ఉత్పత్తులను భారతదేశం నుండి నేపాల్ కు తీసుకువెళుతున్నాయి.  భారతదేశం మరియు నేపాల్ నేడు దక్షిణ ఆసియాలో మొట్టమొదటి సరిహద్దు పెట్రోలియం ఉత్పత్తుల అనుసంధానమైన మోతిహరి-అమ్లేఖ్గంజ్ చమురు పైపులైన్ ను ప్రారంభించాయి. ఇది నేపాల్ కి ఇంధన డిమాండ్లను తీర్చడానికి, అలాగే ఇంధన రవాణా ఖర్చును తగ్గించటానికి సహాయపడుతుంది. మోతీహరి-అమ్లేఖ్‌గంజ్ ఆయిల్ పైప్‌లైన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ఇంకా నేపాల్ ప్రధాని కెపి శర్మ ఒలి సంయుక్తంగా వీడియో లింక్ ద్వారా ప్రారంభించారు.


మొదటి దశలో 60 కిలోమీటర్ల పొడవున్న పెట్రోలియం పైప్‌లైన్‌ను, బీహార్‌లోని మోతీహరి నగరం నుంచి డీజిల్ సరఫరా చేయడానికి ఉపయోగించనున్నట్లు నేపాల్ ప్రభుత్వ అధికారులు తెలిపారు. సరిహద్దులో తమ వైపున ఉన్న పైప్‌లైన్‌కు భద్రత కల్పించడానికి నేపాల్ సైన్యం కోసం ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం, 1973 నుండి అమల్లో ఉన్న ఒక ఒప్పందం లో భాగంగా ట్యాంకర్లు పెట్రోలియం ఉత్పత్తులను భారతదేశం నుండి నేపాల్ కు తీసుకువెళుతున్నాయి.


పెట్రోలియం ఉత్పత్తుల సరుకు ద్వారా ఏటా రూ .2 బిలియన్లను ఆదా చేయాలని నేపాల్ ఆయిల్ కార్పొరేషన్ (ఎన్‌ఓసి) భావిస్తోంది. పెట్రోలియం ఉత్పత్తుల లీకేజీని తగ్గించడం ద్వారా మిలియన్ల రూపాయలు అదనంగా ఆదా అవుతుందని నివేదించింది. మోతీహరి-అమ్లేఖ్‌గంజ్ చమురు పైప్‌లైన్ ప్రాజెక్టును మొదట 1996 లో ప్రతిపాదించారు. అయితే, 2014 లో ప్రధానమంత్రి మోడీ ఖాట్మండు పర్యటన కారణంగ, ఈ ప్రాజెక్ట్ చివరకు రూపం దాలుస్తోంది ఉంది. 


ఈ ప్రాజెక్టును అమలు చేయడానికి రెండు ప్రభుత్వాలు 2015 ఆగస్టులో ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే, నేపాల్‌లో 2015 లో సంభవించిన భూకంపం, దక్షిణ సరిహద్దు వెంబడి సరఫరా అవరోధాలు వంటివి ఏర్పడిన తరువాత ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అయింది. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు ఎట్టకేలకు గత ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభమయ్యాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: