తిరుమలలో దళారులకు చెక్ పెడుతోంది టిటిడి. ఒక ఎమ్మెల్సీతో పాటు చెన్నై మాజీ సలహా మండలి సభ్యులను బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. ప్రొటోకాల్ దర్శనాలను వీళ్ళు దుర్వినియోగపర్చారని గుర్తించిన టిటిడి వీరి పేర్లను బ్లాక్ లిస్టులో చేర్చింది. కుటుంబ సభ్యుల పేరుతో ఇతరులకు దర్శనాలు కల్పించారని గుర్తించారు. తిరుమలలో దళారీల వేట కొనసాగుతోంది. శ్రీ వారి దర్శనానికి సంబంధించి విఐపిలకు జారి చేసేటువంటి టికెట్లలో ఎలాంటి అక్రమాలూ జరగకూడదు అన్నటువంటి తలంపుతో అటు టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డితో పాటు స్పెషల్ ఆఫీసర్ ధర్మారెడ్డి ఉన్నారు.దీనికి సంబంధించి ఇప్పటికే వారు గట్టిగా చర్యలు తీసుకుంటామంటూ కూడా పేర్కొనడం, అందులో భాగంగా టీటీడీ చైర్మన్ తన కార్యాలయంలో జారి చేసేటువంటి టికెట్లను కూడా పరిశీలించాలని చెప్పి విజిలెన్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం, అటు తర్వాత కూడా జేఈవో కార్యాలయం నుంచి జారీ అవుతున్న టికెట్లను విజిలెన్స్ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అరవై ఐదు మంది దళారీలు పీఆర్ వోలు ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి వారిని అరెస్టు చేయడం, వారిని కోర్టుకు హాజరు పర్చడం కూడా జరిగింది.


వీరందరిని కూడా ఇప్పటికే రిమాండ్ విధించారు. మరోవైపు ప్రజాప్రతినిధులే అక్రమాలకు స్వయంగా పాల్పడుతున్నట్లు కూడా టిటిడి అధికారులు గుర్తించారు. ఒక ఎం ఎల్ సి విఐపికి సంబంధించినటువంటి ప్రోటోకాల్ దుర్వినియోగం చేస్తున్నట్లుగా కూడా టీటీడీ అధికారులు గుర్తించారు. గత నాలుగు రోజులుగా వరుస రోజుల్లో శ్రీవారి దర్శనానికి వస్తుండడం ప్రోటోకాల్ దర్శనాన్ని కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే టీటీడీ జారి చేస్తుండగా ఇతర వ్యక్తులను వెంట పెట్టుకుని శ్రీ వారి ఆలయం దర్శనాన్ని సౌఖర్యాన్ని ఎంఎల్సికి కల్పిస్తుంటే వారికి సంబంధించినటువంటి వెసులు బాటును దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తించి అతనిని బ్లాక్ లిస్టులో ఉంచారు.




మరింత సమాచారం తెలుసుకోండి: