దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు చూసుకుంటే జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హరియాణా, ఢిల్లీల్లో పొడి వాతావరణం కొనసాగుతోంది. రాజస్థాన్ నుండి మాన్సాస్ ట్రస్ట్ అక్షం బంగాళాఖాతం దాకా ఉంది. దీంతో రాజస్థాన్ లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మధ్యప్రదేశ్ లో అల్పపీడన ప్రభావం కొనసాగుతోంది దీంతో మధ్యప్రదేశ్ లో చాలా చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. ఇటు ఛత్తీస్ ఘర్, ఒడిశాలో సాధారణ నుండి ఒకట్రెండు చోట్ల భారీ వానలు పడుతున్నాయి.


తూర్పు భారతదేశంలో చూసుకుంటే అస్సాంలో సైక్లోనిక్ సర్క్యులేషన్ కొనసాగుతుంది. ఈ ప్రభావంతో సిక్కిం, అస్సాం, నాగాలాండ్ లో మోస్తరు నుండి ఒకట్రెండు చోట్ల భారీ వానలు పడుతున్నాయి. గుజరాత్ లో సైక్లోనిక్ సర్క్యులేషన్ కొనసాగుతుంది, ఈ ప్రభావంతో అక్కడ కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు గుజరాత్ నుండి ఆఫ్ షోట్రఫ్ కేరళ దాకా కొనసాగుతుంది. ఈ ప్రభావంతో మధ్య మహారాష్ట్ర, కొంకణ్, గోవాల్లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఇటు ఆఫ్ షోట్రఫ్ ప్రభావంతో కర్ణాటకలో చాలా చోట్ల భారీ వానలు పడుతున్నాయి. కేరళలో సాధారణ వర్షాలు, తమిళనాడులో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి.


కాని చాలా వరకు పొడి వాతావరణమే కొనసాగుతుంది అక్కడ . ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో వర్ష ప్రభావం కొంత తగ్గిందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే కురుస్తున్నాయి. ఇంక అత్యధికంగా తెలంగాణలోని ములుగులో నలభై రెండు మిల్లిమీటర్లు , మహబూబాబాద్ లో నలభై మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆంధ్ర ప్రదేశ్ విషయానికొస్తే అక్కడక్కడా తేలికపాటి వర్షాలే కురుస్తున్నాయి . అత్యధికంగా ఈస్ట్ గోదావరిలో ముప్పై నాలుగు మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. రాయలసీమలో చాలా వరకు పొడి వాతావరణమే కొనసాగతూ అక్కడక్కడ మాత్రమే చిరుజల్లులు కురుస్తున్నాయి


మరింత సమాచారం తెలుసుకోండి: