ఆర్టికల్ 370 రద్దు తరువాత ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. జమ్మూ కాశ్మీర్ విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని పాక్ అంటోంది.  అవసరమైతే యుద్ధం చేస్తామని చెప్తున్నది.  భారత్ ను ఎదుర్కోవాలంటే జీహాద్ తరహా దాడులే శిరోధార్యం అని ఆ దేశ అధ్యక్షుడు చెప్పాడు అంటే భారత్ పై ఎంతటి అక్కసు ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు. పాక్ సైన్యం సహాయంతో ఉగ్రవాదులను ఇండియాలోకి ప్రవేశపెట్టాలని చూస్తున్నది.  ఇండియాలోకి ప్రవేశపెట్టి వారితో ఇండియాలో అలజడులు సృష్టిస్తే.. తద్వారా పైచేయి సాధించవచ్చని చోస్తున్నది పాక్.  


పాక్ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు ఇండియా తిప్పికొడుతున్నది.  జమ్మూకాశ్మీర్లో దాడులకు పాల్పడేందుకు పధక రచన చేస్తున్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి.  నిఘా వర్గాల హెచ్చరికలతో ఇండియా అప్రమత్తం అయ్యింది.  ఇందులో భాగంగా శ్రీనగర్ లో 8 మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది.  వారినుంచి సమాచారం రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.  ఇక ఇదిలా ఉంటె, జమ్మూ కాశ్మీర్లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతుందని పాక్ ఆరోపిస్తున్నది.  


జమ్మూ కాశ్మీర్లో సంగతి పక్కన పెడితే... పాక్ లో మైనారిటీపై దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. మైనారిటీల హక్కులను కాపాడవుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు ఆర్మీ, ఐఎస్ఐ చేతిలో కీలుబొమ్మలా మారాడని, వారు చెప్పినట్టుగా చేస్తున్నారని పాక్ అధికారపార్టీ మాజీ ఎమ్మెల్యే బల్ దేవ్ కుమార్ పేర్కొన్నారు.  తనపై తప్పుడు కేసులు బనాయించి హింసిస్తున్నారని, తన కుటుంబ సభ్యులకు అక్కడ రక్షణలేదని, తనకు భారత్ లోఆశ్రయం ఇవ్వాలని కోరుతున్నాడు బల్ దేవ్ కుమార్.  


పాక్ లో మైనారిటీకే కాదు.. అక్కడి ముస్లింలకు కూడా రక్షణలేదని, మానవహక్కుల ఉల్లంఘన జరుగుతున్నదని అయన అన్నారు.  ప్రస్తుతం అయన భారత్ లోని లూథియానా ప్రాంతంలో ఉన్న ఖన్నా అనే ప్రాంతంలో ఉన్నారు.  తాను తన కుటుంబంతో సహా ఇండియాలోనే ఉండాలని అనుకుంటున్నాని, దానికి భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని ఆయన వేడుకుంటున్నాడు.  ఒక ప్రజాప్రతినిధికే అక్కడ రక్షణ లేకుంటే.. మిగతా వాళ్లకు రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది.  కష్టమే కదా.  బల్ దేవ్ లాంటి వాళ్ళు పాక్ లో ఎందరో ఉన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: