టీడీపీ ఆధినేత చంద్ర‌బాబు నాయుడే ఝ‌ల‌క్ ఇచ్చాడు మాజీ మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి. క‌డ‌ప జిల్లాకు చెందిన ఆదినారాయ‌ణ రెడ్డి టీడీపీ కి గుడ్‌బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ద‌మ‌య్యాడు. అందుకే టీడీపీ బాస్ చంద్ర‌బాబు నాయుడు ఎంత చెప్పినా విన‌కుండా పార్టీ మారేందుకే నిర్ణ‌యం తీసుకున్నాడు. ఇప్పుడు ఆదినారాయ‌ణ రెడ్డి ఇచ్చిన షాక్‌తో చంద్ర‌బాబు నాయుడుకు దిమ్మ‌తిరిగిపోయింది. ఆదినారాయ‌ణ రెడ్డి రేపు బీజేపీలో చేరేందుకు అన్ని సిద్దం చేసుకున్నాడు.


2014 ఎన్నికల్లో ఆదినారాయ‌ణ రెడ్డి  వైసీపీ తరఫున గెలిచాడు. క‌డ‌ప జిల్లాకు చెందిన ఆదినారాయ‌ణరెడ్డి వైసీపీలో గెలిచి త‌రువాత తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. వెంట‌నే చంద్ర‌బాబు నాయుడు త‌న క్యాబినెట్‌లో మంత్రి పదవి కూడా ఇచ్చాడు. చంద్ర‌బాబునాయుడు ఆదినారాయణ రెడ్డిని పూర్తిగా న‌మ్మి త‌న‌ను న‌మ్మిన నేత‌ల‌ను చిన్న‌చూపు చూసాడు. దీంతో క‌డ‌ప జిల్లాలో టీడీపీలో వ‌ర్గ‌పోరు న‌డిచింది. 


అలా టీడీపీ కి గ‌డ్డు ప‌రిస్థితులు రావ‌డంతో ఆదినారాయ‌ణ‌రెడ్డితో పాటు టీడీపీ నేత‌లు వ‌రుస‌బెట్టి ఓట‌మి బాట ప‌ట్టారు. టీడీపీ అధికారానికి దూరం కావ‌డం, తాను 2014 ఎన్నిక‌ల్లో గెలిపించిన వైసీపీ పార్టీ అధికారంలోకి రావ‌డంతో చేసేదేమి లేక ఆయ‌న బీజేపీ వైపు చూపులు చూస్తున్నారు. తాను వెన్నుపోటు పొడిచిన పార్టీలోకి పోవ‌డం ఇష్టం లేని ఆదినారాయ‌ణ రెడ్డి త‌న స్నేహితుడు ఎంపీ సీఎం రమేష్ కూడా బీజేపీ కండువా కప్పుకోవడంతో ఆయన ద్వారా ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి తీసుకువచ్చేలా చర్చలు జరుగుతున్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఆదినారాయణ రెడ్డి ఇటీవ‌ల సుమారు గంటసేపు భేటీ అయ్యారు. ఈ భేటీలో జమ్మలమడుగు ప్రాంతంలోని త‌న అనుచ‌రుల‌పై దాడులు జ‌రుగుతున్న నేప‌థ్యంలో తాను పార్టీ మారుతున్న‌ట్లు చంద్ర‌బాబుకు చెప్పిన‌ట్లు తెలిసింది. ఏదేమైనా వ‌ల‌స వ‌చ్చిన నేత‌ల‌ను న‌మ్ముకుంటే ఇలాంటి గ‌తే ప‌డుతుంది అనేది ఆదినారాయ‌ణ రెడ్డి ఉదంత‌మే నిద‌ర్శ‌నం.


మరింత సమాచారం తెలుసుకోండి: