రాజకీయాలు మరియు పంజాబీ సంగీతంపై అధికంగా ఇష్టం కలిగి ఉండే డిల్లీ వాసులలో, గంజాయి మీద కూడా మక్కువ అధికంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఒక కొత్త అధ్యయనం ప్రకారం, 38.26 మెట్రిక్ టన్నులు లేదా 38,260 కిలోలు వినియోగించిన భారతదేశ రాజధాని ప్రపంచంలో మూడవ అతిపెద్ద గంజాయి వినియోగదారు అని ప్రపంచ లెక్కలలో వెల్లడించారు. 

 

 
డేటా ఆధారిత మీడియా ప్రచార సంస్థ అయిన ఎబిసిడి నిర్వహించిన '2018 గంజాయి ధరల సూచిక' అనే అధ్యయనం కొత్త డేటాను విడుదల చేసింది. ఇది ప్రపంచంలోని 120 నగరాల్లో గంజాయి వాడుక సంఖ్యను వెల్లడించింది.  ఈ అధ్యయనం ఇంతకుముందు విడుదల చేసిన 2018 గంజాయి ధరల సూచికను పరిశీలించింది. ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రదేశాలు గంజాయి చట్టబద్ధతను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాయో తెలుపుతుంది.

 

 
అధ్యయనంలో, న్యూయార్క్ (యుఎస్ఎ) మరియు కరాచీ (పాకిస్తాన్) తరువాత అత్యధికంగా గంజాయి వినియోగం ఉన్న టాప్ 10 నగరాల్లో డిల్లి ఉంది. ముంబై కూడా మొదటి పది స్థానాల్లో నిలిచింది. ఆరవ స్థానంలో ఉన్న ముంబయి లో సగటున 32.38 టన్నులు లేదా 32,380 కిలోలు వినియోగంలో ఉంది. డిల్లి లో గంజాయి వినియోగం 'పాక్షికంగా' చట్టబద్ధం అని పేర్కొన్నప్పటికీ, భారతదేశంలో గంజాయి చట్టబద్ధత మీద చాలావరకు గందరగోళం ఉంది.

 

ముఖ్యంగా గంజాయి రెసిన్ మరియు పువ్వుల ఉత్పత్తి అమ్మకాలను ఎన్డిపిఎస్ నిషేధించింది. కాని ఆకులు మరియు విత్తనాల వాడకాన్ని అనుమతించింది. దీనివల్ల రాష్ట్రాలు వాటిని నియంత్రించటానికి అనుమతిస్తాయి. దీని అర్థం ఏమిటంటే, 'చరాస్' మరియు 'గంజా' ఉత్పత్తి చట్టవిరుద్ధం. అయితే 'భాంగ్' ను కలిగి ఉన్న విత్తనాలు మరియు ఆకులు చట్టబద్ధమైనవి. ఆశ్చర్యకరంగా, పన్ను విధించినట్లయితే గంజాయి అమ్మకాలలో లాభదాయకంగా ఉన్న దేశాలలో భారతదేశం కనిపించదు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: