గవర్నర్ నరసింహం కేసీయార్ ల మధ్య ముఖ్యమంత్రి రాజ్యపాల్ ల మధ్య ఉండాల్సిన బంధం కంటే ఎక్కువే ఉంది. దాని వల్ల కేసీయార్ బాగానే లాభపడ్డారు. ఆరేళ్ళ పాటు ఆయన సీఎం గా బాగానే హవా చలాయించారు. ఆయన ఏమనుకున్నా, ఏం చేసినా ఇబ్బంది లేకుండా సాఫీగా జరిగిపోయింది. ఇపుడు వచ్చింది మహిళా గవర్నర్. పైగా కరడు కట్టిన బీజేపీ నాయకురాలు. కేంద్రం ఏరి కోరి మరీ నియమించింది. మరి కొత్త గవర్నర్ ఇలా వచ్చినో లేదో తన పవరేంటో చూపించేసిందని అంటున్నారు.


కాకతాళీయం అయినా మహిళా గవర్నర్ వచ్చిన వేళనే కేసీయార్ మంత్రి వర్గాన్ని విస్తరించారు. ఒకరు కాదు ఇద్దరు మహిళలను తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇది నిజంగా గొప్ప పరిణామమేనని అంటున్నారు. తొలి విడత నాలుగున్నరేళ్ళు ఉన్నపుడు కానీ, రెండవమారు తొమ్మిది నెలలుగా అధికారంలో ఉన్నపుడు కానీ కేసీయార్ కి ఒక్క మహిళకైనా మంత్రి పదవి ఇవ్వాలనిపించలేదు. అప్పట్లో చాలా మంది మహిళలు పదవి కోసం ఎంతగానో ఎదురుచూశారు. విసిగివేశారారు కానీ కేసీయార్ ఏమనుకున్నారో ఏమో తన మంత్రివర్గంలో మహిళలకు నో చాన్స్ అనేశారు.


ఇపుడు సబితా ఇంద్రారెడ్డితో పాటు, సత్యవతి రాధోడ్ లకు మంత్రి పదవులు కోరి మరీ ఇచ్చారు. అంతే కాదు, ఇద్దరికీ కీలకమైన శాఖలు కట్టబెట్టారు. మరి మహిళా గవర్నరా మజాకా అని అపుడే సరదాగా సెటైర్లు పడుతున్నారు. ఇపుడు కేసీయార్ రాజ్యంలో తొలి పౌరుడు అంటే గవర్నర్ గా మహిళ  ఉన్నారు. అలాగే మంత్రివర్గంలో కూడా మహిళలు ఉన్నారు. సెప్టెంబర్లో అడుగుపెట్టేంతవరకూ ఇది ఎవరూ వూహించినది కానేకాదు. మరి అది జరిగింది అంటే తమిళ్ సై ప్రభావం   అలా ఇలానా అంటున్నారట. మరి తమిళ్ సై అంటే అంతేగా.



మరింత సమాచారం తెలుసుకోండి: