భాగ్యనగరంలో గణేష్ శోభ యాత్రకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల పన్నెండున ఉదయం ఎనిమిది గంటలకు శోభ యాత్రను ప్రారంభించనున్నట్లు హైదరాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తెలిపింది. ఈ కార్యక్రమానికి ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు సమితి సభ్యులు తెలిపారు. నిమజ్జనం రోజు ఎంజే మార్కెట్ వద్ద మోహన్ భగవత్ ప్రసంగం ఉంటుందని సమితి కార్యదర్శి భగవంత్ రావు స్పష్టం చేశారు. మోహన్ భగవత్ ప్రసంగం వీక్షించేలా మొత్తం పన్నెండు స్ర్కీన్స్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.


మరోవైపు శోభ యాత్రలో సినిమా పాటలు డిజెలు డాన్స్ లు ఇలాంటివి చేయకూడదని ఆదేశించారు. గణేష్ శోభ యాత్రకు నలభై లక్షల మంది వరకు రావచ్చంటున్నారు. హైదరాబాద్ లో జరిగే గణేష్ నిమజ్జన శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే గణేష్ ఉత్సవ సమితి కమిటీ సభ్యులు కూడా పూర్తిగా గణేష్ శోభయాత్రకి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి చూస్తున్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సామూహిక గణేశ్ నిమజ్జనానికి అన్ని మండలాల వినాయక నిమర్జనానికి తరలి రావాల్సిందిగా పిలుపు నిచ్చారు.


దేశ భక్తిని, దైవభక్తినీ ప్రభోదించేటువంటి భజన, సంకీర్తనలు, కోలాటాలు, నృత్యాలు ఈ రకమైనటువంటి దేశ భక్తి, దైవభక్తి పెంపొదించే కార్యక్రమాల ద్వారా ఊరేగింపులో తరలి రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం తరపున అన్ని రకాల పారిశుధ్యం గురించి గానీ, రోడ్ రిపేరింగ్ గురించి గానీ, ట్రీ కట్టింగ్ గాని, కేబుల్ కటింగ్స్ గానీ ఎలాంటి అవాంతరాలు రాకుండా అదే రకంగా నిమజ్జన ప్రాంతాల లోపల ఫెన్సింగ్ ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. క్రేన్స్ ద్వారా నిమజ్జనం తొందరగా అయ్యేలాగ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. నిమజ్జనమైన పదార్థాన్ని 24 గంటల లోపల తరలిస్తారు.



మరింత సమాచారం తెలుసుకోండి: