ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుతోంది, నాగార్జున సాగర్ జల కళను సంతరించుకుంది. దీంతో ఇరవై రెండు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. అయితే ప్రాజెక్టు నిండి పోవడంతో క్రస్ట్ గేట్ల పై నుంచి సైతం వరద నీరు కిందకు దిగుతుంది. ముందుగా పదహారు గేట్లను ఎత్తిన అధికారులు ఇన్ ఫ్లో ఎక్కువగా ఉండటంతో ఆ తర్వాత ఇరవై రెండు గేట్లతో నీటిని వదులుతున్నారు. శ్రీశైలం నుంచి దాదాపు నాలుగు లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో డ్యామ్ నుంచి మూడు లక్షల అరవై వేల క్యూసెక్యుల నీటిని దిగువకు వదిలారు.


సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ఐదు వందల ఎనభై తొమ్మిది పాయింట్ ఏడు సున్నా అడుగులుగా ఉంది. ఎగువ కృష్ణా పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా బేషిన్ లో ఉన్నటువంటి రిజర్వాయర్లన్నీ ఇప్పటికే పూర్తిగా నిండాయి. దీంతో కృష్ణమ్మ నాగార్జున సాగర్ వైపు కూడా పరుగులు పెడుతోంది. శ్రీశైలం ప్రోజెక్ట్ నుంచి భారీగా వరద నీరు వస్తున్నటువంటి వరద నీటితో నాగర్జునసాగర్ క్రస్టు గేట్ల మీదుగా కృష్ణమ్మ జాలువారుతోంది. మొత్తం క్రమంగా రాత్రి నుంచి ఆ ఎనిమిది గేట్లను ఎత్తడం ప్రారంభమైనట్టు గేట్లు దాదాపు అన్ని గేట్లు ఎత్తే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం సమాచారం ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సాగర్ ప్రొజెక్ట్ కు ఇన్ ఫ్లోస్ మూడు లక్షల డెబ్బై ఏడు వేల క్యూసెక్యుల నీరు వస్తోంది.



దీంతో అధికారులు ఈ గేట్లను క్రమంగా ఎత్తి దిగువకు రెండు లక్షల తొంభై నాలుగు వేల క్యూసెక్ ల నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితి. రెండు వేల తొమ్మిదిలో రికార్డు స్థాయిలో వచ్చినటువంటి వరద నీరు మరోసారి పునరావృతం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఒక్కో గేటును పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఆగస్టు పన్నెండవ తేదీనాడు రికార్డు స్థాయిలో వరద నీరు రావడంతోటి పూర్తిగా ఇరవై ఆరు క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. అప్పటి నుంచి కూడా ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్ లన్ని పూర్తిగా నిండాయి. ప్రస్తుతం కొద్ది రోజులుగా ఎగువ కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మళ్లీ కృష్ణమ్మ ఉప్పొంగుతుండటం తోటి రిజర్వాయర్ లన్నీ పూర్తిగా నిండాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: