ఉన్న‌త విద్యా అవ‌కాశాల‌కు సుప‌రిచిత‌మైన దేశాల్లో ఒక‌టైన బ్రిట‌న్‌లో కీల‌క మార్పులు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి.  ఆస్ర్టేలియాలో ప్రస్తుతం ఉన్న ‘పాయింట్స్ బేస్డ్ ఇమిగ్రేషన్​సిస్టమ్’​ను అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  బ్రెగ్జిట్ ప్రక్రియ పూర్తయిన తర్వాత తమ వీసా విధానంలో మార్పులు చేసేందుకు బ్రిటన్ ప్రతిపాదనలు రెడీ చేస్తోంది.వీసాకు దరఖాస్తు చేసే వ్యక్తి నైపుణ్య స్థాయిని బట్టి ఇంగ్లీష్ స్కిల్స్​కు ర్యాంకులు ఇవ్వనున్నారు.ఇంగ్లీష్ ​ప్రొఫిషియన్సీతో పాటు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, వర్క్ ఎక్స్​పీరియన్స్..  తదితర అంశాలను కొత్త ఇమిగ్రేషన్ ​సిస్టమ్​లో పరిగణనలోకి తీసుకోనున్నారు.  ఈ మేరకు విధివిధానాలను యూకే హోం సెక్రెటరీ ప్రీతి పటేల్ ఫైనలైజ్ చేస్తున్నారు. 


ఇటీవల విధించిన గడువు ప్రకారం యూరోపియన్ ​యూనియన్ (ఈయూ) నుంచి అక్టోబర్​31లోగా బ్రిటన్ ​బయటికి రావాల్సి ఉంది. తాజా ప్ర‌తిపాద‌న‌ల ప్ర‌కారం, ఆస్ట్రేలియా పాయింట్ల సిస్టమ్ ప్రకారం.. ‘సుపీరియర్ ఇంగ్లీష్’ ఉన్న స్కిల్డ్ మైగ్రెంట్లకు 20 పాయింట్లు ఇస్తున్నారు. అయితే ఇందుకు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఏదైనా ల్యాంగ్వేజీ టెస్టులో 8 లేదా అంతకన్నా ఎక్కువ స్కోర్ సాధించాలి. తర్వాత 7 మార్కులు సాధించిన ‘ప్రొఫిసియెంట్ ఇంగ్లిష్’ మైగ్రెంట్లకు 10 పాయింట్లు ఇస్తున్నారు. ‘కంపీటెంట్ ఇంగ్లీష్’ కలిగిన వారికి మాత్రం ఎలాంటి పాయింట్లు రావు.


కాగా, బ్రిటన్​కొత్త ప్రధాన మంత్రిగా లండన్​ మాజీ మేయర్, బ్రెగ్జిట్​కు హార్డ్​కోర్​ సపోర్టర్​ అయిన బోరిస్​జాన్సన్ అధికార పగ్గాలు చేపట్టారు. రూలింగ్ కన్సర్వేటివ్​పార్టీ లీడర్షిప్​కోసం జరిగిన ఎన్నికల్లో జాన్సన్ ఘన విజయం సాధించారు.​  ఆయన ప్రత్యర్థి, ప్రస్తుత విదేశాంగ మంత్రి జెరెమీ హంట్ కు 46,656 ఓట్లు రాగా, జాన్సన్​కు 92,153 ఓట్లు పడ్డాయి. దీంతో బ్రిటన్​కన్సర్వేటివ్​ పార్టీ లీడర్​గా, తద్వారా  ప్రధానిగా జాన్సన్​నియామకం ఖరారు అయింది. బ్రెగ్జిట్​(యూరోపియన్​యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు వెళ్లేందుకు)కు జాన్సన్​ మొదటి నుంచీ గట్టిగా మద్దతు తెలుపుతున్నారు. తనను ప్రధానిని చేస్తే.. వేర్పాటు ఒప్పందం లేకుండా లేదంటే ఏదో ఒక డీల్ తో అయినా.. బ్రెగ్జిట్ ​సాధిస్తానని, అక్టోబరు 31 డెడ్​లైన్​నాటికి బ్రిటన్​ను తప్పకుండా యూరోపియన్​యూనియన్​నుంచి బయటకు తీసుకొస్తానని జాన్సన్ హామీ ఇచ్చారు. బ్రెగ్జిట్​పై 2016లో రెఫరెండం నిర్వహించగా, ఎక్కువమంది ప్రజలు యూరోపియన్​యూనియన్​నుంచి బయటకు రావాలనే కోరుకున్నారు. తర్వాత పరిణామాల నేపథ్యంలో  బ్రెగ్జిట్ పై ఎటూ తేల్చుకోలేని విధంగా​సంక్షోభం ఏర్పడటంతో ప్రస్తుత ప్రధాని థెరెసా మే జూన్​ 7న రాజీనామా చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: