గుంటూరులో పునరావాసం పాలిటిక్స్ ఉద్రిక్తతకు దారి తీస్తున్నాయి. పోటా పోటీగా టీడీపీ వైసీపీ పిలుపు నిచ్చిన చలో ఆత్మకూరు వ్యవహారంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఇది పల్నాడుతో పాటు గుంటూరులో కూడా హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు. ఇప్పటికే టిడిపి ఘాటుగా విమర్శలు చేస్తుంటే అంతే ఘాటుగా రివర్స్ కౌంటరిస్తోంది వైసీపీ. పోటా పోటీగా చలో ఆత్మకూరు ఎలా ఉండబోతుంది అనేది మాత్రం హైటెన్షన్. పోలీసులు భారీగా మోహరించి ఉన్నారు. రేపు అనేది ఎలా ఉండబోతుందనే మాత్రం పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. గుంటూరు మొత్తం కూడా ఒక హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది.



ఇప్పటికే టిడిపి చలో ఆత్మకూరుకు పిలుపు నిచ్చింది. మరోవైపు వైసిపి కూడా అదే సమయంలో రేపు చలో ఆత్మకూరుకు పిలుపు నిచ్చింది. రెండు పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా చలో ఆత్మకూర్ వెళ్తామని ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. నిన్న రాత్రి నుండే పల్నాడంతా కూడా వన్ ఫార్టి ఫోర్ సెక్షన్ విధించటం జరిగింది. నరసరావుపేట సబ్ డివిజన్ పరిధిలోనూ అలాగే గురిజాల సబ్ డివిజన్ పరిధి లోనూ కూడా రెండు చోట్లతో పాటు సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలో కూడా రాత్రి నుంచి వన్ ఫార్టి ఫోర్ సెక్షన్, సెక్షన్ థర్టి అమలు చేస్తున్నారు



అదే విధంగా రెండు పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలు, మంత్రులు కూడా జిల్లా లోని ప్రధాన నగరం గుంటూరు లోనే ఉండటంతో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే గుంటూరు అర్బన్ పోలీసులు కూడా ముందస్తు చర్యలు తీసుకున్నారు. గుంటూరు నగరమంతా కూడా వన్ ఫార్టి ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నారు. సెక్షన్ తర్టి కూడా అమలు చేస్తున్నారు. సెక్షన్ తర్టీ అమలలో ఉన్న నేపథ్యంలో ముందస్తుగా అనుమతి లేకుండా ఎటువంటి సభలు సమావేశాలు, నలుగురు వ్యక్తులు గుమ్ముకూడటం కూడా చట్ట వ్యతిరేకమవుతుంది. పోలీసుల అనుమతి లేకుండా ఈ కార్యక్రమాలు చేస్తే ముందస్తుగా చట్టపరమైన చర్యలు తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంది.



రేపు ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో రెండు పార్టీలకు సంబంధించిన నేతలు గుంటూరులోని టీడీపీ నిర్వహించిన శిభిరం వద్ద నుంచి టిడిపి, వైసిపి పార్టీ నుంచి వైసీపీ నేతలు కూడా చలో ఆత్మకూరుకు బయలుదేరనున్న నేపథ్యంలో గుంటూరు అర్బన్ పోలీసులు అయితే ముందస్తు చర్యలు తీసుకున్నారు. శిభిరం వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. పెద్ద ఎత్తున పోలీసులు, ఉన్నతాధికారులు మరో వైపు ఫాల్కను,వజ్రా వంటి వాహనాలను కూడా ఇక్కడకు తీసుకొచ్చి బాధితులు ముందుగా గనుక పోలీసుల మాట వినకుండా బయలుదేరే పరిస్థితి ఉంటే వాళ్ళందరిని అరెస్టు చేసేందుకు కూడా సిద్దమయ్యారు.



మరింత సమాచారం తెలుసుకోండి: