గత 10రోజులుగా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన జరిమాలతో బాధపడుతున్నా వాహనదారులకు ముఖ్యమంత్రి శుభవార్త చెప్పాడు. ఇప్పుడు ఉన్న ట్రాఫిక్ జరిమానాలు భారీగా తగ్గిస్తూ ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఈ జరిమానాలు తగ్గించింది మన ముఖ్యమంత్రి కాదు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ నిర్ణయం ఇది. 


జరిమానాలు భారీగా పడుతున్నాయి అని ఆ జరిమానాలు మేము కట్టలేకపోతున్నాం అంటూ వాహనదారులు బెంబేలెత్తుతున్న వాహనదారులకు కాస్తంత ఊరట లభించినట్లయింది. కొత్తగా అమల్లోకి చట్టం ప్రకారం హెల్మెట్ లేకుండా వాహనం నడిపిస్తే 1000 రూపాయిలు చెల్లించాల్సి ఉంది.                         


అయితే గుజరాత్ లో మాత్రం ఆ చెల్లించాల్సిన జరిమానాతో 500 రూపాయిలను తగ్గించారు. ఇంకా కారు నడిపే వాళ్ళు సీటు బెల్ట్ పెట్టుకోకుండా ప్రయాణం చేస్తే కొత్తగా అమల్లోకొచ్చిన జరిమానాలు ప్రకారం వెయ్యి రూపాయిలు అయితే అందులోనూ సగం తగ్గించేశారు అంటే 500 రూపాయిలు..                         


ఇంకా నిర్లక్షంగా అతి వేగంతో వాహనాన్ని నడిపితే వారికీ కొత్త జరిమానా ప్రకారం 5000 రూపాయిలు చెల్లించాలి. అయితే టూవీలర్స్ అతివేగంగా నడుపుతూ మొత్తాన్ని 1500 రూపాయిలు, లైట్ మోటార్ వెహికల్స్‌కు రూ.3000, ఇతర వాహనాలకు రూ.5000 జరిమానాగా నిర్ణయించారు. ఏది ఏమైనా గుజరాత్ వాహనదారులకు ఇదే శుభవార్తే. ఇలాంటి శుభవార్త మనము త్వరలో వినాలి అని ఆశిద్దాం.                                                                                   


మరింత సమాచారం తెలుసుకోండి: