పాకిస్థాన్ కాశ్మీర్ విషయంలో ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. మొన్నటి వరకు కాశ్మీర్ విషయంలో ఒక విధంగా స్పందించిన పాక్ ఇప్పుడు ఏకంగా ఐక్యరాజ్య సమితి సమావేశంలో కాశ్మీర్ భారత్ లో ఒక రాష్ట్రమని ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఇలా పాక్  రోజుకొక స్టేట్మెంట్ ఇస్తూ ఆ దేశపు డొల్లతనాన్ని బయట పెట్టుకుంటుంది. అయితే పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీద ఎక్కడ భారత్ కన్ను పడుతుందోనని పాక్ వ్యూహాత్మకంగా ఇటువంటి వ్యాఖ్యలు చేసిందా అని సందేహం వస్తుంది. భారత్ తో యుద్ధం చేసి ఓడించే శక్తి పాక్ కు లేదని దానికి తెలుసు. రెండు రోజుల నుంచి పాక్ ఆర్మీ చీఫ్ .. ఇమ్రాన్ ఖాన్ యుద్ధం తప్పదంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది.


భారత్ ఎక్కడ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను ఆక్రమించుకుంటుందోనని పాక్ లో ఆ ఆందోళన క్లియర్ గా కనిపిస్తుంది. అందుకే పైకి ఈ వ్యాఖ్యలు చేస్తుందని చెప్పాలి.  కాశ్మీర్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగం కాదని ఎప్పటికైనా తాము చేజిక్కించుకుంటామని పాక్ కలలు కనింది. కానీ మోడీ ప్రభుత్వం ఒక్క దెబ్బతో కాశ్మీర్ ను భారత్ లో కలిపేసుకుంది. దీనితో భారత్ తమ నెక్స్ట్ టార్గెట్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని తేల్చి చెప్పింది. ఇప్పుడు ఇదే విషయం పాక్ ను ఖంగారు పెట్టిస్తుంది.


ఇన్ని రోజులు కాశ్మీర్ కు స్వయం ప్రతి పత్తి ఉండటంతో పాక్ చాలా ఆటలు ఆడింది. కానీ ఇప్పుడు పీఓకే ను పాక్ కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ మాత్రం తేడా జరిగిన భారత్ .. పీఓకేను భారత్ లో కలిపేసుకుంటుందని పాక్ కు బాగా తెలుసు. అయితే కాశ్మీర్ విషయంలో ఐరాస పట్టించుకోకపోవడంతో . .పైగా ఇది భారత్ అంతర్గత వ్యవహారమని తేల్చి చెప్పడంతో పాక్ ఎక్కడ లేని అసహనానికి గురవుతోంది. అందుకే విచక్షణ కోల్పోయి రాబోయే రోజుల్లో భారత్ తో పూర్తి స్థాయి యుద్ధం తప్పదని పిచ్చి కూతలు కూస్తుంది. మా దగ్గర అను బాంబులు ఉన్నాయి అంటూ ఇమ్రాన్ ఖాన్ పిచ్చోడి మాదిరిగా మాట్లాడుతున్నారు. దీనితో పాకిస్థాన్ అంతర్జాతీయ సమాజంలో ఏకాకిలా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: