Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Sep 22, 2019 | Last Updated 5:20 pm IST

Menu &Sections

Search

కలివికోడి పక్షి గురించి ఎప్పుడైనా విన్నారా..?

కలివికోడి పక్షి గురించి ఎప్పుడైనా విన్నారా..?
కలివికోడి పక్షి గురించి ఎప్పుడైనా విన్నారా..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కలివికోడి అత్యంత అరుదైన పక్షుల్లో ఒకటి, దాన్ని చూద్దామన్నా కనిపించని పరిస్థితి. దశాబ్దం క్రితం ఓ మారుమారు చూశామని చెపుతున్నా అక్కడ ఆధారాలు మాత్రం లేవు. దాని కోసం అంతులేని అన్వేషణ కొనసాగుతోంది. మళ్లీ దాని కూతలను వినిపించే ప్రయత్నం జరుగుతోంది. అంతరించిపోతున్న అరుదైన పక్షి జాతులు, వందేళ్ల కాలంలో కనుమరుగైన బుల్లి గూబలు, టెక్నాలజీకి బలవుతున్న మూగజీవాలు, గత వందేళ్ళ కాలంలో ఎన్నో జీవజాతులు అంతరించిపోయాయి. అందులో అరుదైన పక్షి జాతులు కూడా ఉన్నాయి. మన చిన్నతనంలో ఇంట్లో దూరి సందడి చేసిన పిచ్చుకలు బుల్లి గూబలు ఇప్పుడు చూద్దామన్నా కనిపించడం లేదు. అరుదైన పక్షి జాతులు అంతరించడానికి కారణాలు చాలానే ఉన్నాయి. కనెక్టివిటీ పేరుతో పెరుగుతున్న సెల్ ఫోన్ టవర్ లు దాన్నుంచి పరిమితికి మించి వెలువడే రేడియేషన్ అడవులను ఖాళీ చేస్తూ జరుగుతున్న పట్టణీకరణ పెరుగుతున్న కాలుష్యంతో మూగజీవాలు బలైపోతున్నాయి.


అలా కనుమరుగవుతున్న అరుదైన పక్షిజాతుల్లో జెర్డాన్స్ కోర్సర్ ఒకటి. మానవ తప్పిదాలకు అంతరించిపోతున్న పక్షి జాతిలో కలివికోడి కూడా ఉంది. దీన్నే జెర్డాన్స్ కోర్సర్ గా పిలుస్తారు, అత్యంత అరుదైన జాతికి చెందిన పక్షి ఇది. పధ్ధెనిమిది వందల నలభై ఎనిమిదిలో ఈ పక్షిని తొలి సారిగా శాస్త్రవేత్త థామస్ జెర్డాన్ గుర్తించారు. అందుకే దీనికి అతని పేరునే పెట్టారు. పంతొమ్మిదవ దశకంలో చివరి సారిగా ఈ పక్షి జాడ కనిపించింది. అప్పటి నుంచి దీని కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంది. పురుగులను ఆహారంగా తీసుకునే కలివికోడి పైకి పెద్దగా ఎగర లేదు. ఇది ఉదయమంతా నిద్రపోతుంది, రాత్రి సమయాల్లో మాత్రమే సంచరిస్తూ ఆహారాన్ని వెతుక్కుంటుంది. అందుకే సాధారణంగా ఎవరి కంటా పడదు.ఈ పక్షుల నివాస ప్రాంతాలను కనుక్కోవడం కూడా అంత సులభం కాదు. గత వందేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా ఈ పక్షి జాతి అంతరించిపోయిందని శాస్త్రవేత్తలు చెబుతున్నా దాని జాడలు భారత్ లో అందులోనూ మన తెలుగు రాష్ట్రంలో వుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కలివికోడి కోసం అంతులేని అన్వేషణ, అభయారణ్యాల్లో జల్లెడ పడుతున్న శాస్త్రవేత్తలు, కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తున్నా ప్రభుత్వం, కలివికోడి జాతి ఎప్పుడో అంతరించిపోయిందని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత శాస్త్రవేత్తలు నమ్ముతున్నా ఇక్కడ మాత్రం దాని కోసం అన్వేషణ కొనసాగుతోంది. మన దేశంలో తొలిసారి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జెర్డాన్స్ కోర్సర్ పక్షి జాడను కడప జిల్లాలోని లంకమల అటవీ ప్రాంతంలో గుర్తించారు. దురదృష్టవశాత్తు అది చనిపోవడంతో దాన్ని బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ మ్యూజియంలో ఉంచారు. రెడ్డిపల్లిలోని అటవీ ప్రాంతంలోనూ కలివికోడి జాడలు కనిపించాయి.దీంతో ఈ అరుదైన జాతి పక్షిని సంరక్షించేందుకు ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని అభయారణ్యంగా ప్రకటించింది. కలివికోడి ఆవాస ప్రాంతంగా నాలుగు వందల అరవై నాలుగు పాయింట్ ఐదు చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని గుర్తించి లంకమల్లేశ్వర వన్యప్రాణి అభయారణ్యంగా ప్రకటించారు. కొండూరులో కలివికోడి పరిశోధనా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. అటవీ ప్రాంతంలో గుర్తించిన జాడలు ఆధారంగా అక్కడ వంద వరకు జెర్డాన్ జాతి పక్షులు ఉండొచ్చని అంచనా వేశారు. కానీ ఇప్పటి వరకూ ఒక్క కలివికోడిని కూడా కళ్లారా చూసిన వాళ్లు లేరు. కలివికోడి సంరక్షణకు ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యత నిచ్చాయి. అభయారణ్యంగా ప్రకటించిన ప్రాంతం గుండా తవ్వాల్సిన తెలుగుగంగ ప్రాజెక్ట్ దిశను కూడా మార్చారు.కడప, బద్వేల్ రహదారిలో రాత్రిపూట వాహనాన్ని కూడా అనుమతించటంలేదు. బొంబాయి న్యాచురల్ హిస్టరీ సొసైటీకి చెందిన పరిశోధకుడు జగన్నాథన్ తొలిసారిగా ఈ పక్షి కూతను అభయారణ్యంలో రికార్డ్ చేశారు. అప్పటి నుంచి దీని అన్వేషణ మరింత ముమ్మరంగా సాగుతోంది. ఆయన జాడ దొరకటం లేదు. కలివికోడి జాడ తెలుసుకునేందుకు దాని సంరక్షణ కోసం రెండు వేల పన్నెండు ఏడాది వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుమారు యాభై కోట్ల రూపాయలకు పైనే ఖర్చు చేశాయి. ఎంతకీ కలివికోడి జాడ దొరక్కపోవడంతో బొంబాయి న్యాచురల్ హిస్టరీ సొసైటీ శాస్త్రవేత్తలు తమ అన్వేషణ ఆమెకిచ్చారు. మళ్లీ గత రెండేళ్ల నుంచి దీని కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు లంకమల అభయారణ్యంలో కలివికోడి జాడ కోసం వెతుకుతున్నారు. అడవిలో ఎక్కడికక్కడ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే పొదలు కింద వాయిస్ రికార్డర్ లో పెట్టి మరీ అన్వేషణ కొనసాగిస్తున్నారు. కలివికోడి కోసం అన్వేషిస్తున్న శాస్త్రవేత్తలకు ఫారెస్ట్ అధికారులు కూడా సహకరిస్తున్నారు.ఈ అరుదైన జాతి పక్షి సంరక్షణ కోసం ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని అధికారులు చెబుతున్నారు. లంకమల అటవీ ప్రాంతంలో ఖచ్చితంగా జెర్డాన్ జాతి పక్షులు ఉన్నాయని వాటి జాడ గుర్తించి సంరక్షిస్తామని అంటున్నారు. రెండు వేల పదకొండు వరకు కూడా ఈ ప్రాజెక్ట్ మీద భారీగా పరిశోధనజరిగింది తరవాత కాలక్రమేణా ఒక నాలుగు సంవత్సరాల మరుగునపడిపోయినా కూడా లాస్టియర్ కార్తీక్ సాయి అనే వ్యక్తి రావడమో తరవాత పరిశోధనా మల్లీ స్టార్ట్ చేయడం జరుగుతుంది.


 Have you ever heard of a bird?
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.