సెప్టెంబర్ 1 తరువాత దేశంలో వాహన చట్టం అమలులోకి వచ్చింది.  ఆ చట్టం అమలులోకి వచ్చిన తరువాత వరసగా చలానాలు వేస్తున్నారు.  ఎక్కడా ఎవరిని వదలడంలేదు. సామాన్యుల దగ్గరి నుంచి పోలీసుల వరకు ఎవరు అతిక్రమించినా.. జరిమానా కట్టాల్సిందే.  జరిమానా కట్టకపోతే ఎవరికైనా ఒకటే శిక్ష.  దీంతో ఎవరైనా సరే రూల్స్ బ్రేక్ చేయాలంటే భయపడిపోతున్నారు.  


గతంలో ఇలాంటి రూల్ ఉండేవి కాదు.  రూల్స్ ఉన్నా వాటిని అమలు చేయడంలో అప్పటి కేంద్ర ప్రభుత్వాలు వెనకబడ్డాయి.  కారణం రాజకీయం.  రాజకీయాలు చేయడానికి చూస్తున్నారు గాని, చట్టాలను అమలు చేసి  ప్రతి ఒక్కరు దేశాన్ని, చట్టాన్ని గౌరవించేలా చూద్దామని ఎవరూ అనుకోలేదు.  దీంతో ఎవరివారు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు.  రూల్స్ ఫాలో కాకపోవడం వలనే నేరాలు పెరిగిపోతున్నాయి.  ఘోరాలు జారిపోతున్నాయి.  యాక్సిడెంట్ జరుగుతున్నాయి.  


ఒకసారి చట్టాలను కఠినం చేస్తే.. అతిక్రమించడానికి భపడతారు.  భద్రతను కోరుకునే వ్యక్తులు చట్టాలను గౌరవించి నడుచుకుంటారు.  అన్ని కరెక్ట్ గా ఉంటె.. ఎవరు ఎవర్ని ఆపరు.. మన దగ్గర తప్పులుంటేనే దేనికైనా మనం భయపడాల్సి వస్తుంది.  అయితే, బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ రాష్ట్రంలో వాహన చట్టంలో ఉన్న జరిమానాలు కొంతమేరకు తగ్గించేందుకు ముందుకు వచ్చింది.  


ఇప్పటి వరకు హెల్మెట్ లేకుంటే 1000 రూపాయలు ఫైన్ ఉండేది.  దాన్ని 500 లకు తగ్గించింది.  లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే 5వేలు ఫైన్ ఉండేది.  దాన్ని 2 వేలకు తగ్గించారు.  లైసెన్స్ లేకుండా కారు నడిపితే 3 వేలు ఫైన్.  ఇలా ఫైన్ లను తగ్గించి అమలు చేస్తున్నారు.  దేశంలో బాగా అభివృద్ధి చెందిన దేశంలోనే ఈ చట్టాన్ని అక్కడి ప్రభుత్వం పరిస్థితులకు అనుగుణంగా తగ్గించి ఫైన్ వసూళ్లు చేస్తుంటే.. కొన్ని రాష్ట్రాలు మాత్రం గరిష్టంగా వసూలు చేస్తున్నాయి.  ఖజానాను ఈ పేరుతో నింపుకుంటున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: