ఈ ప్రపంచం అంతులేని వింతలకు ఆలవాలు,ఎక్కడో ఒకచోట ఏదో ఒక విచిత్రమైన సంఘటనలు జరుగుతూనే వుంటాయి. కాలజ్ఞానంలో బ్రహ్మంగారు కూడా చెప్పారు.ఏ ఏ సమయంలో ఎలాంటి సంఘటనలు ఈ సృష్టిలో చోటుచేసుకుంటాయో.ఇక కొన్నీంటి వింత జననం వెనక శాస్త్రీయపరమైన కారణాలు వుంటాయని సైంటిస్టులు వెల్లడిస్తున్నారు.ఈ వింత జననాలు మనషుల్లోనే కాదు,జంతువుల్లో,పశువుల్లో.పక్షుల్లో కూడ జరుగుతుంటాయని జన్యుశాత్రవేత్తలు వెల్లడించారు..ఇప్పటికే మనం చాలసార్లు ఎన్నో వింతైన జననాలను చూసాం కాని ఇలాంటి జననం బహూశా చూసి వుండం.అదేంటంటే ఓ ఆవు మనిషి ముఖం కలిగిన దూడకు జన్మనివ్వడం.ఇంతకు ఈ వింత ఎక్కడ చోటు చేసుకుందో ఇప్పుడు తెలుసుకుందాం..



అర్జెంటీనాలోని విల్లా అనే గ్రామంలో వున్న ఓ ఆవు మనిషి ముఖం కలిగిన దూడకు జన్మనిచ్చిందట.పుట్టిన ఈ ఆవుదూడ తన రూపంలో కాకుండా మనిషిలాగే ఉండటంతో స్థానికులు ఆశ్చర్యపోయారు.అయితే,దురదృష్టకరమేంటంటే ఈ దూడ జన్మించిన కొద్ది సేపటికే కన్ను మూసిందట.ఇంకేముంది వింత రూపంలో పుట్టిన ఈ దూడను చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారట.అందులో కొందరు ఈ సందర్భంగా వీడియో తీసి వైరల్ చేశారు.సాధారణంగా ఆవులకు పెద్ద ముక్కు, చెవులు, నోరు ఉంటాయి.అయితే,దీనికి మాత్రం మనిషి తరహాలో చిన్నవిగా ఉన్నాయి.దాని పుర్రె కూడా మనిషి రూపంలోనే ఉంది.



దీనిపై జన్యుశాస్త్ర నిపుణుడు నికోలస్ మ్యాగ్నాగో మాట్లాడుతూ.జన్యు పరివర్తన వల్ల ఈ ఆవు దూడా ఆ రూపంలో పుట్టి ఉంటుందన్నారు.అంతే కాకుండా ఒక్కోసారి డీఎన్‌ఏల్లో మార్పు వల్ల కూడా ఇలాంటివి జరుగుతుంటాయని తెలిపారు. భౌతిక, రసాయన లేదా జీవ సంబంధ చర్యల వల్ల దూడ జన్యు శ్రేణిలో మార్పులు కలిగాయని,అందువల్లే దాని రూపంలో మార్పు వచ్చిందన్నారు.దాని వల్ల పుర్రె సరైన క్రమంలో ఎదగలేదని,దానివల్ల మనిషి రూపంలో కనిపిస్తోందని తెలిపారు.ఏది ఏమైన ఇది ప్రపంచంలో ఓ వింత విషయమేనని పేర్కొన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: