ఏదో మోటు సామెతలో చెప్పినట్లుగా తయారైంది చంద్రబాబునాయుడు వ్యవహారం. మొన్నటి ఎన్నికల్లో వైసిపి చేతిలో చావుదెబ్బ తిన్న దగ్గర నుండి చంద్రబాబు ఏమి మాట్లాడుతున్నారో చాలామందికి అర్ధం కావటం లేదు. చంద్రబాబు మాటల్లో జగన్మోహన్ రెడ్డి అంటే కసి బయటపడిపోతోంది. మూడు నెలల పాలనలో జగన్ ను తప్పు పట్టటానికి ఏమీ లేక చివరకు టిడిపి కార్యకర్తలపై దాడులు అనే అంశాన్ని పట్టుకుని నానా యాగీ చేస్తున్నారు.

 

గొడవలు జరగలేదని వైసిపి నేతలు కూడా అనటం లేదు. గ్రామాల్లోని రెండు పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య వ్యక్తిగత గొడవలు జరిగుండవచ్చనే అంటున్నారు వైసిపి నేతలు. వ్యక్తిగత గొడవలను పార్టీకి ప్రభుత్వానికి ముడిపెట్టి చంద్రబాబు కావాలనే ప్రభుత్వంపై బురద చల్లుతున్నట్లు వైసిపి నేతలు మండిపడుతున్నారు. ఇందులో కొంత వాస్తవం కూడా ఉంది.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రజాస్వామ్యం గురించి, వ్యక్తి స్వేచ్చ గురించి భీబత్సంగా మాట్లాడుతున్న చంద్రబాబుకు తన హయాంలో ఏమి జరిగిందో గుర్తు తెచ్చుకుంటే బాగుంటుంది.  గురజాలలో యరపతినేని అక్రమ మైనింగ్ ను బయటపెట్టిన వారిపై పోలీసులు ఎన్ని కేసులు పెట్టించారు. చింతమనేని ప్రభాకర్ ఎంతమందిని కొట్టింది చంద్రబాబుకు తెలీదా ?

 

అనంతపురం జిల్లాలో పరిటాల శ్రీరామ్, ధర్మవరంలో వరదాపురం సూరి, తాడిపత్రిలో జేసి సోదరుల అరాచకాలపై చంద్రబాబు అప్పట్లో స్పందించారా  ?  అప్పట్లో టిడిపి నేతల అరాచకాలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసులు పెట్టారా ? కోడెల కుటుంబం బాధితుల మాటేమిటి ? ఫిర్యాదు చేసిన వారిపైనే ఉల్టా కేసులు పెట్టలేదా ? ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి టిడిపి నేతల అరాచకాలు. ఇపుడు చంద్రబాబు చేస్తున్న గోలతో పాత పురాణం అంతా బయటకు తీస్తున్నారు వైసిపి నేతలు. చంద్రబాబు ఇదే విధంగా గగ్గోలు పెడుతుంటే నష్టపోయేది చిరవకు టిడిపినే అన్న విషయం మరచిపోయినట్లన్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: