భారతదేశంలో భారీ ఎత్తున నిర్వహించే ఉత్సవాల్లో ఒకటి వినాయక చవితి.  మతసామరస్యానికి ప్రతికగా ఈ వేడుకలో ప్రతి ఒక్కరు పాల్గొంటారు.  వినాయక చవితి ఉత్సవాలను సజావుగా జరిగేవిధంగా చూడటం పోలీస్ యంత్రాంగానికి సవాలుతో కూడుకొని ఉంటుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా చూస్తుంటారు. 

ఇదిలా ఉంటె, హైదరాబాద్ లో ఖైరతాబాద్ వినాయకుడికి మంచి పేరు ఉన్నది.  ఈ ఉత్సవాల సమయంలో ఈ గణనాథుడిని దర్శించుకోవడానికి ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు.  అలా వచ్చిన భక్తులు గణపతిని దర్శించుకొని కోరికలు కోరి వెళ్తుంటారు.  ఉత్సవాలు జరిగే తొమ్మిది రోజులు ఆ ప్రాంతం అంతా భక్తులతో కిక్కిరిసిపోతుంది.  తెల్లవార్లూ గణపతిని దర్శించుకుంటూనే ఉంటారు.  తొమ్మిదోరోజు గణపతి నిమర్జనం జరుగుతుంది.  


దీంతో పాటు హైదరాబాద్ లో ఫేమస్ బాలాపూర్ గణపతి.  లడ్డూ వేలం ద్వారా బాలాపూర్ గణపతి ఫేమస్ అయ్యాడు.  ఇక పాతబస్తీలో గణపతి విగ్రహాలు ఎక్కువగా ఉంటాయి.  పోటాపోటీగా అక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు.  ఈ ఉత్సవాల సమయంలో పాతబస్తీలో టెన్షన్ వాతావరణం నెలకొంటుంది.  ముఖ్యంగా వినాయకుడి నిమర్జనం రోజున లక్షలాది మంది జనాలు ఈ నిమర్జన కార్యక్రమాన్ని చూడటానికి వస్తుంటారు.  అలా వచ్చే భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంటారు.  


అయితే, ఖైరతాబాద్ గణపతి తరువాత హైదరాబాద్ నగరంలో అంతపెద్ద గణపతి విగ్రహం ఎక్కడుందో తెలుసా.. దాదాపుగా తెలియదనే చెప్పాలి.  ఈ ఏడాది హైదరాబాద్ లో 36 అడుగుల మహాగణపతిని మరోచోట కూడా ఏర్పాటు చేశారు.  చైతన్యపురిలోని కమలానగర్లో శ్రీ మణికంఠ అయ్యప్ప భక్త సమాజం ఆధ్వర్యంలో ఈ గణపతిని ఏర్పాటు చేశారు.  36 అడుగుల ఎత్తైన ఈ భారీ విగ్రహన్నీ ఖైరతాబాద్ విగ్రహం నిర్మించిన శిల్పి రాజేంద్రనే నిర్మించారు.  గోకుల వినాయకుడిగా ఈ విగ్రహాన్ని నిర్మించారు.  ఇకపై ప్రతి ఏడాది అక్కడ కూడా భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారట.  


మరింత సమాచారం తెలుసుకోండి: