గత మూడు నెలలుగా ఏపీ రాజకీయాలు అమరావతి చుట్టూనే తిరుగుతున్నాయి. ఏపీకి రాజధాని అమరావతి అవునా కాదా అన్న చర్చ కూడా సాగుతోంది. అసలు అమరావతి ఉంటుందా, లేక కొత్త రాజధాని వస్తుందా అన్న దాని మీద వాదోపవాదాలు జోరుగా సాగుతున్నాయి. ఇంతకీ అమరావతి కధేంటి. అందులో సింగపూర్ కధేంటి అన్నది కూడా ఇపుడు ఆసక్తికరమే. అమరావతిని ప్రపంచ రాజధానిగా చేసేందుకు గత చంద్రబాబు సర్కార్ సింగపూర్ కన్సార్టియంల‌ ద్వారా సాయం తీసుకుంది.


సింగపూర్ కన్సార్టియంలు  కూడా ఉచితంగా అమరావతి రాజధాని డిజైనులు చేసి ఇచ్చాయి. . దాని మీద ఓ లెవెల్లో నాటి టీడీపీ సర్కార్ గొప్పలు పోయింది. ఆ తరువాత అసలు కధ తెలిసింది. అమరావతిలో 1691 ఎకరాలను  స్టార్టప్ ఏరియాగా అభివ్రుధ్ధి చేసేందుకు సింగపూర్ కన్సార్టియం లతో నాటి సర్కార్ ఒప్పందాలను చేసుకుంది. అభివ్రుధ్ధి చేసిన తరువాత 51 శాతం వాటాను సింగపూర్ కన్సార్టియం లకు ఇవ్వడానికి 49 శాతమే ప్రభుత్వానికి ఇవ్వడానికి కూడా ఒప్పందం చేసుకున్నాయి.


దీని మీద అప్పట్లో వైసీపీ గట్టిగా వ్యతిరేకించింది. మన భూమిని ఇస్తూ డెవలప్ చేయిస్తూ అందులో మళ్ళీ పెద్ద వాటా ఇవ్వడం ఏంటని కూడా వైసీపీ నేతలు గరం గరం అయ్యారు. అవన్నీ ఇలా ఉంటే గడచిన మూడు నెలలుగా అమరావతిలో అవినీతిపై నిపుణుల కమిటీతో  విచారణ పేరిట  పనులను వైసీపీ సర్కార్ వాయిదా వేసిన సంగతి విధితమే.  దీని మీద సింగపూర్ మంత్రి కూడా సమీక్ష చేసుకునే అధికారం ఏపీ ప్రభుత్వానికి ఉన్నప్పటికీ ఆ ప్రభావం తమ దేశపు సంస్థలపై ఏ విధంగా ఉంటుందోనన్న సందేహాన్ని సింగపూర్ మంత్రి బాలకృష్ణన్ వ్యక్తం చేశారు.



ఇవన్నీ ఇలా ఉంటే అమరావతిలో  స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేసేందుకుఒప్పందాలు కుదుర్ఛుకున్న  సింగపూర్‌కు చెందిన సెంబ్‌కార్ప్, అసెండాస్, సింగ్‌బ్రిడ్జ్ సంస్థలు ఇపుడు వెనక్కి పోతున్నాయన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఈ విషయంలో నిజానిజాలు తెలియనప్పటికీ ప్రస్తుత  ప్రభుత్వం తీరు భిన్నంగా ఉండడంతో తాము తప్పుకోవాలనుకుంటున్నట్లుగా అవి భావిస్తున్నాయట.  ఈ నేపధ్యంలో రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి సింగపూర్ పర్యటన చేపట్టారు. అక్కడ ఆయన సింగపూర్  సంస్థలతో భేటీ అయి అన్ని విషయాలు చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది



ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ రాజధానిపై ఫోకస్ పెంచింది. సింగపూర్‌తో భవిష్యత్ ప్రణాళికలు ఏ విధంగా ఉంటాయనేది మంత్రి రాజేంద్రనాధ్ రెడ్డి పర్యటన అనంతరం కొలిక్కి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. ఓ విధంగా చూసుకుంటే సింగపూర్త్ సంస్థల విషయంలో జగర్ సర్కార్ వైఖరి బాబుకు భిన్నంగా ఉండబోతోందన్నది తెలిసిందే. దాంతో సింగ పూర్తి సంస్థలు వెనక్కిపోతున్నాయని అంటున్నారు. చూడాలి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: