మోటార్ వెహికల్ చట్టం 2019 ప్రకారం కొత్తగా వచ్చిన పెనాల్తీలు చూసి ప్రజలు కింద మీద పడిపోతున్నారు. ఇప్పటికే ఉన్న వాటిని భరించలేక కుయ్యో...మొర్రో... అని బ్రతుకుతున్న వారి పై మరొక కొత్త రూల్ వచ్చి పడింది. అయితే ఇది మాత్రం చాలా కఠినంగా… వాహన చోదకుల వెన్ను వణికించేలాగా ఉంది. నిజానికి ఈ రూలు ఈ సంవత్సరం వచ్చిన వెహికల్ చట్టం కన్నా ముందే ఉందట.... అయితే ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ప్రస్తుతం వచ్చిన కొత్త చట్టంతో పాటు దీన్ని కూడా చాలా స్ట్రిక్ట్ గా అమలుపరచబోతున్నారట.

ఇంతకీ ఈ నియమం ఏమిటంటే మీరు గేర్లు ఉన్న బైక్ నడుపుతున్నప్పుడు చెప్పులు వేసుకోకూడదు. చెప్పులు అంటే 'హవాయి చెప్పల్స్', ఫ్లిప్ ఫ్లాప్స్ లేదా స్లిప్పర్స్ వేసుకొని గేర్లు ఉన్న ద్విచక్ర వాహనాలని నడపకూడదు. అలా చేస్తే దాదాపు వెయ్యి రూపాయల వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఈ విషయంపై క్లారిటీ తీసుకుందామని ఒక ప్రముఖ మీడియా సంస్థ ట్రాఫిక్ పోలీస్ వర్గాలు ఆశ్రయించగా వారు ఈ నియమం కొత్తగా వచ్చిన మోటార్ వెహికల్ చట్టం కన్నా ముందే ఉందని స్పష్టం చేశారు. స్లిప్పర్స్ వంటి చెప్పులు వేసుకుని గేర్లు బండి నడపడం వల్ల గేర్లు మార్చేటప్పుడు స్లిప్ అవడం లేదా గ్రిప్ దొరకక బండి ఆగి పోవడం వంటివి జరుగుతున్నాయని వారు తెలియజేశారు. అంతే కాదండోయ్ వెయ్యి రూపాయలు జరిమానా కట్టిన తర్వాత కూడా మళ్లీ చెప్పులు వేసుకుని బండి నడిపితే 15 రోజుల జైలు శిక్ష విధిస్తారట.

ఇకపోతే ట్రాఫిక్ అధికారులు చెప్తుంది ఏమిటంటే ఇప్పటికే ఉన్న పెనాల్టీల మధ్య దీనిని తమ సీరియస్ గా ఇంకా పరిగణించడం లేదని లేకపోతే రానున్న రోజుల్లో మాత్రం కచ్చితంగా దీనిని కూడా సక్రమంగా అమలు చేస్తామని వారు అన్నారు. ప్రస్తుతం అతికొద్ది ఏరియాల్లోనే దీనిని అమలు పరుస్తున్నట్లు మరియు కొన్ని చోట్ల ఇదే తప్పుని మళ్ళీ మళ్లీ చేస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకున్నట్లు వారు తెలిపారు. ఇకపోతే రాజస్థాన్ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ మధ్యనే బండి లేదా కార్ పైన వాళ్ళ కులం లేదా మతానికి సంబంధించిన స్టిక్కర్లు ఉంటే పెనాల్టీలు విధిస్తున్నారు. అంతేకాకుండా కారు విండ్ షీల్డ్ పైన గ్రాఫిక్స్ ఉన్నా.... రుసుము కట్టాల్సిందే. అలాంటి వాటి వల్ల ఎదురుగా వచ్చే వాహనాలను గుర్తించేందుకు వీలుగా లేకుండా డ్రైవర్ చూపుకు భంగం కలుగుతుంది.

కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టం ఇలా ప్రభుత్వం కొంచెం కఠినంగా నియమాలు పెట్టడం వల్ల ప్రజలకు మొదటి ఇబ్బందిగా ఉన్నా తర్వాత కచ్చితంగా వారే లాభపడతారు.


మరింత సమాచారం తెలుసుకోండి: