తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఛలో ఆత్మకూరుకు అనుమతి లేదని చెప్పిన పోలీసులపై దుర్భాషలాడారు. 144 సెక్షన్ ఉన్నందువలన అనుమతించలేమని చెప్పిన పోలీసులతో మమ్మల్నే అడ్డుకుంటున్నారా అని అన్నారు. ఐపీఎస్ క్యాడర్ ఉన్న ఎస్పీ అధికారిని యూజ్ లెస్ ఫెల్లోస్ అని అచ్చెన్నాయుడు తిట్ల దండకం అందుకున్నాడు. ఛలో ఆత్మకూరు పేరుతో చంద్రబాబు పిలుపునిచ్చిన కార్యక్రమానికి పోలీసులు అనుమతి లేదని లేదని చెప్పటంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. 
 
అచ్చెన్నాయుడు చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళే సమయంలో పోలీసులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. 144 సెక్షన్ మరియు యాక్ట్ 30 అమలులో ఉన్నాయని, చంద్రబాబు నాయుడు ఇంట్లోకి వెళ్లటానికి ఎవరికీ కూడా అనుమతి లేదని, మీరు ఇక్కడే ఆగిపోవాలని పోలీసులు అచ్చెన్నాయుడిని కోరారు.అచ్చెన్నాయుడును ఆపటంతో పోలీసులపై అచ్చెన్నాయుడు రెచ్చిపోయాడని తెలుస్తోంది. 
 
నువ్వెవరు నన్ను అడ్డుకోవటానికి అని పోలీసులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఎస్పీ విక్రాంత్ పటేల్ పై దురుసుగా ప్రవర్తించటమే కాకుండా యూజ్ లెస్ ఫెలో అంటూ కూడా నోరు పారేసుకున్నాడు. అధికారులు ఎంతగా వారించినా అచ్చెన్నాయుడు వినలేదని తెలుస్తుంది. సహకరించాలని ఎన్నిసార్లు విఙప్తి చేసినా వినలేదని తెలుస్తుంది. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ నేతలు పోలీసులను దూషించిన ఘటనలు ఉన్నాయి. 
 
పోలీసులు శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని 144 సెక్షన్ ను అమలు చేశారు. పోలీసులు హెచ్చరికలు చేసినా కొందరు టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు ఇంటినుండి బయటకు రావటానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. నారా లోకేశ్ మరికొందరు నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నట్లు తెలుస్తోంది. అనుమతి లేకుండా ఊరేగింపులు, ధర్నాలు చేయవద్దని డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలు జారీ చేశారు. గుంటూరుతో సహా సమస్యాత్మక ప్రాంతాలలో భారీగా పోలీసులను మోహరించినట్లు తెలుస్తోంది. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు కొంతమంది నేతల్ని హౌస్ అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. 





మరింత సమాచారం తెలుసుకోండి: