కచ్చితంగా చెప్పాలంటే అవుననే చెప్పాలి. గడచిన మూడు నెలలుగా  జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎలా గబ్బు పట్టించాలా అని చంద్రబాబునాయుడు తెగ ఆరాట పడిపోతున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా శాంతి భద్రతల ముసుగులో చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారు.  

 

ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్న ఉద్దేశ్యంతోనే చంద్రబాబు చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని రెడీ చేశారు.  మాజీ సిఎం అనుకున్నట్లే చిన్న విషయాన్ని బూతద్దంలో చూపుతు బాగా పెద్దదిగా కనబడేట్లు చేశారు. నిజానికి చంద్రబాబు ఆరోపిస్తున్నట్లుగా రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఏమీ విఘాతం కలగలేదు. చంద్రబాబు హయాంలో వైసిపి నేతలను టార్గెట్ చేసినట్లుగా ఇప్పటి వరకూ ఎక్కడా జరగలేదు.

 

గ్రామాల్లో చెదురుమదురు ఘటనలను అడ్డం పెట్టుకుని జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు రెచ్చిపోయారు. ఎల్లోమీడియా మద్దతుతో విస్తృత ప్రచారం కల్పించారు. తన మీడియా ద్వారా పాలనలో జగన్ ఫెయిల్ అని ముద్ర వేయించాలన్న చంద్రబాబు విష ప్రచారాన్ని ఎల్లోమీడియా సమర్ధవంతంగా ముందుకు తీసుకెళుతోంది. చిన్న విషయాన్ని కూడా తనకు అనుకూలంగా చంద్రబాబు ఎలా మలచుకోగలరో కొత్తగా ఎవరికీ చెప్పాల్సిన  పనిలేదు.

 

చంద్రబాబు ఆలోచనలను ముందుగా పసిగట్టి ఎత్తుకు పై ఎత్తులు వేయటంలో ప్రభుత్వం విఫలమైందనే చెప్పాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకనో వైసిపి నేతల్లో స్పీడు తగ్గిపోయింది.  చంద్రబాబు అండ్ కో కు కౌంటర్ ఇవ్వాల్సిన మంత్రులు పట్టించుకోలేదు. దాంతో ప్రచారమంతా ఏకపక్షంగా అది కూడా చంద్రబాబుకు అనుకూలంగా జరిగిపోయింది.

 

చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని చంద్రబాబు దాదాపు ఐదు రోజుల క్రితమే ప్రకటించినా మంత్రులెవరూ పట్టించుకోలేదు. చంద్రబాబు చేస్తున్న ఆరోపలన్నీ తప్పులే అని నిరూపించటంలో నిర్లక్ష్యం వహించారు. దాని ఫలితమే ఈరోజు వందల కొద్ది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సును పెట్టాల్సి రావటం, టిడిపి నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేయటం. చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని భగ్నం చేయటానికి ప్రభుత్వం హడావుడిగా ఇపుడు రంగంలోకి దిగి విషయాన్ని కంపు చేసుకుంది. చంద్రబాబుకు కావాల్సింది కూడా సరిగ్గా ఇదే.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: