తెలంగాణాలో బాజాపా దూకుడు పెంచిన సంగతి తెలిసిందే.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్నది. అందుకోసమే పావులు కడుపుతున్నది.  ఇందులో భాగంగానే నేతలకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధం అయ్యింది బీజేపీ.  ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా లక్ష్మణ్ ఉన్నారు.  మూడేళ్లకు ఒకసారి మార్పులు జరుగుతుంటాయి.  


ఈసారి మార్పు ఉంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉన్నది.  బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవికోసం చాలామంది అసలు పెట్టుకున్నారు.  దాదాపు అరడజను మంది ఈ పదవి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  గత మూడేళ్ళుగా తాను చేసిన విషయాలను బీజేపీ కేంద్ర కార్యలయానికి తెలియజేశారు లక్ష్మణ్.  కేంద్రం కూడా లక్ష్మణ్ ను కొనసాగించాలని చూస్తున్నది.  


మరోవైపు నిజామాబాద్, కరీంనగర్ ఎంపీలు కూడా ఈ రేస్ లో ఉన్నారు.  ఇద్దరు యువకులు.. అయితే బండి సంజయ్ వైపు ఆర్ఎస్ఎస్  చూస్తున్నది. బండి సంజయ్ యువకుడు దూకుడు స్వభావం కలిగిన వ్యక్తి.  అలాంటి వ్యక్తులకు బాధ్యతలు అప్పగిస్తే.. పార్టీ ఈజీగా జనాల్లోకి వెళ్తుందని ఆర్ఎస్ఎస్ఆలోచన .  ధర్మపురి అరవింద్ కు కూడా అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.  


వీరితో పాటు కాంగ్రెస్ నుంచి బీజీపీలో చేరిన డికె అరుణ కూడా పార్టీ అధ్యక్షురాలి రేసులో ఉన్నట్టు సమాచారం.  చాలామంది నుంచి పోటీ ఉండటంతో అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారో చూడాలి.  పార్టీలో మొదటి నుంచి ఉన్న వ్యక్తులకే అవకాశం ఉండొచ్చు అన్నది బీజేపీ వర్గాల అభిప్రాయం.  ఈ విషయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎలాంటి నిజయం తీసుకుంటారో చూడాలి.  మారుస్తారా లేదంటే లక్ష్మణ్ ను కొనసాగిస్తారో కొన్ని రోజుల్లోనే తేలిపోతుంది.  డిసెంబర్ లోగా కొత్త అధ్యక్షులను నియమించే అవకాశం ఉన్నది. దక్షిణాది రాష్ట్రాల్లో కన్నేసిన బీజేపీ దానికి తగ్గట్టుగానే అధ్యక్షులను నియమిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: