ఆంధ్ర ప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన 100 రోజులు పూర్తయ్యిందో లేదో. అనవసరంగా ఆంధ్రప్రదేశ్ లో గొడవలు సృష్టిస్తూ ఆంధ్రలో ప్రశాంత లేకుండా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ ప్రభుత్వం వచ్చాక టీడీపీ నేతలపై దాడులు చేసారని. ఆలా దాడులు జరిగిన వాళ్ళు అంత రావాలని గత మూడు రోజులుగా ''ఛలో ఆత్మకూరు'' కార్యక్రమానికి చంద్రబాబు పిలుపినిచ్చాడు.                           

           

అయితే ఈ పిలుపుపై మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు అంత కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లో వైసీపీ నాయకులు ఛలో ఆత్మకూరు కార్యక్రమంపై స్పందిస్తూ 'తాము కూడా ఛలో ఆత్మకూరు కార్యక్రమాన్ని చేపడుతున్నామని, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలపైనే దాడులు జరిగాయని, అందరూ కలిసి మేము చేపడుతున్నాం అంటూ చెప్పారు.                      


దీంతో ఈరోజు ఇరు పార్టీలు పోటాపోటీగా ఛలో ఆత్మకూరు కార్యక్రమాన్ని చెప్పట్టాయి. అయితే ఈ కార్యక్రమం చెయ్యకూడదని 'ఛలో ఆత్మకూరు' కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు నాయుడుని, నారా లోకేష్ ని ఇంటి నుంచి బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ చేసారు. అయినప్పటికీ ఎంతోమంది రావడంతో వారి అందరిని కూడా అడ్డుకున్నారు.               


దీంతో పల్నాడులో ఉద్రిక్తత ఏర్పడింది. ఒక పక్క చంద్రబాబు నాయుడు 'ఇంటిలోనే నిరాహార దీక్షని మొదలు పెట్టాడు'. మరి ఈ నిరాహార దీక్ష ఎంత మాత్రమే నిజమో తెలియాల్సి ఉంది. బయట చేసే నిరాహార దీక్షల్లోనే ఎన్నో లుసుగులు ఉంటాయి. మరి ఇంటిలో నిరాహార దీక్ష అంటే ఆలోచించాల్సిన విషయమే.                                                   


మరింత సమాచారం తెలుసుకోండి: