ఉద్రిక్తతలను అదుపులో పెట్టటంలో భాగంగా పోలీసులు ముందస్తుగా అధికార పార్టీ నేతలను కూడా హౌస్ అరెస్టులు చేయటమే విచిత్రంగా ఉంది. అధికార పార్టీ ఎంఎల్ఏలను, నేతలను హౌస్ అరెస్టులు చేయటం గతంలో ఎప్పుడూ జరగలేదు. ఉద్రిక్తతలను పెంచి పోషిస్తున్న ప్రతిపక్షాలను, లేదా ఆందోళనలకు పిలుపిచ్చిన ప్రతిపక్ష నేతలను హౌస్ అరెస్టులు చేయటం సహజమే.

 

చలో ఆత్మకూరు కార్యక్రమానికి చంద్రబాబు పిలుపివ్వటంతోనే ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. ఆత్మకూరు గ్రామానికి వెళ్ళనీయకుండా చంద్రబాబు, చినబాబుతో సహా టిడిపి నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు. చంద్రబాబు పిలుపుకు నిరసనగా వైసిపి ఎంఎల్ఏలు కూడా చలో ఆత్మకూరు అంటూ పిలుపివ్వటంతో ఉద్రిక్తతలు పెరిగిపోయాయి.

 

బుధవారం రెండు పార్టీలు కూడా ఆత్మకూరు విలేజ్ లో పోటి కార్యక్రమాలు పెట్టుకున్నాయి. దాంతో ముందుజాగ్రత్తగా ఇటు టిడిపి నేతలతో పాటు అటు అధికార పార్టీ ఎంఎల్ఏలు, నేతలను అరెస్టు చేయటమే విచిత్రంగా ఉంది. బహుశా తాము నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నామని చెప్పటానికే పోలీసులు వైసిపి నేతలను హౌస్ అరెస్టులు చేసినట్లుంది.

 

చంద్రబాబు సిఎంగా ఉన్నపుడు చాలా సార్లు వైసిపి ఎంఎల్ఏలను, నేతలను పోలీసులు హౌస్ అరెస్టులు చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఎటువంటి పిలుపివ్వకపోయినా, ఎటువంటి ఆందోళనలకు పిలుపివ్వకపోయినా సరే వైసిపి ఎంఎల్ఏలను హౌస్ అరెస్టు చేశారు. ఇందుకు కారణం ఏమిటయ్యా అంటే చంద్రబాబు వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్నపుడు వైసిపి ఎంఎల్ఏలు గోల చేసే అవకాశం ఉందన్న నెపంతో ముందస్తు అరెస్టులు చేశారు.

 

అప్పట్లో వైసిపి ఎంఎల్ఏలు, నేతల అరెస్టుకు ప్రభుత్వం నుండి  ఎటువంటి సమాధానం రాలేదు. అప్పట్లో అప్రజాస్వామికమని వైసిపి ఎంఎల్ఏలు ఎంత గొంతు చించుకున్నా ఉపయోగం లేకపోయింది.  తాను సిఎంగా ఉన్నపుడు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన చంద్రబాబు ఇపుడు ప్రజాస్వామ్యం గురించి, రాజ్యంగా ప్రసాదించిన స్వేచ్చ గురించి, విలువల గురించి కథలు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: