నిరంకుశ పాలనలో ఉన్నామా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా..? అని చంద్రబాబు నిలదీశారు. వైసీపీ ప్రభుత్వ దుర్మార్గాలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ఇలాంటి అరాచకాలు పునరావృతం కారాదన్నారు. ఐదేళ్లపాటు ఏం చేశారని నిలదీశారు. మీ ప్రభుత్వ పనితీరుపై జనం నవ్వుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలను రక్షించుకునేందుకు జైలుకెళ్లడానికి కూడా తాము సిద్ధమన్నారు. ఆస్తులకు, ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదేనన్నారు. ఒక పవిత్ర లక్ష్యం కోసం చేస్తున్న పోరాటమన్నారు. బాధితులకు న్యాయం చేయడంలో విఫలం అయ్యారని విమర్శించారు. న్యాయం చేయమన్న టీడీపీపై కక్ష సాధిస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా ‘ఛలో ఆత్మకూరు’ను అడ్డుకోవడంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు



చంద్రబాబు టెలికాన్ఫరెన్స్లో   మాట్లాడుతూ.. అరెస్ట్‌లను ఖండించారు. నిర్బంధం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాలరాయలేరన్నారు. ప్రశ్నించే గొంతును నొక్కడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. శాంతియుత నిరసనలను అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. ప్రజాస్వామ్యంలో దీనిని ఒక చీకటి రోజు అని.. ఇదొక నిరసన దినంగా అభివర్ణించారు. పునరావాస శిబిరానికి ఆహారం సరఫరా అడ్డుకుంటారా..? శిబిరంలో బాధితులకు ఇచ్చే ఆహారం అడ్డుకోవడం అమానుషమని చంద్రబాబు వాపోయారు. ఆహారం అందించడానికి వచ్చిన వాళ్లను వెనక్కి పంపేస్తారా..? అని ప్రశ్నించారు. బాధితుల పట్ల ఇంత నిర్దయగా వ్యవహరిస్తారా..? అంటూ మండిపడ్డారు. యుద్ధానికి వెళ్లడం లేదన్నారు. పోలీసు అధికారులు అన్ని విషయాలు ఆలోచించుకోవాలని, లేదంటే ఇబ్బంది పడతారని హితవు పలికారు.




బాధితులకు సంఘీభావంగా అందరూ నిరసనలు తెలపాలన్నారు. ఈ రోజు ఉదయం 8గం నుంచి రాత్రి 8వరకు నిరాహార దీక్ష చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు అందరూ దీక్షల్లో పాల్గొనాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇంత దౌర్భాగ్య ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని.. అధికారంలో ఉండి బాధితుల శిబిరాన్ని ఏర్పాటు చేయడం సిగ్గుచేటని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.  ఆయన  మాట్లాడుతూ.. తాము బాధితులను వాళ్ల ఇళ్లకు తీసుకెళ్తున్నామని చెప్పారు. ఎందుకు ఇంత అమానుషంగా ప్రవర్తిస్తున్నారని నిలదీశారు. సోషల్‌ మీడియాలో తమ అభిప్రాయాలు చెప్పేవారిని అరెస్ట్‌ చేస్తున్నారని మండిపడ్డారు. అభిప్రాయాలు తెలియజేసే హక్కు కూడా లేదా? అంటూ అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: