ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పల్నాడు రగడ ఉద్రక్తతకు దారి తీసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి టీడీపీ శ్రేణుల పై దాడులు పెరిగాయని ...దీన్ని అరికట్టాలని చంద్రబాబు చలో ఆత్మకూరు కి పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్రంలో నలుమూలల టీడీపీ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. చలో ఆత్మకురు నిరసనకు ప్రభుత్వం అనుమతి లేదని... 144 సెక్షన్ అమలులో ఉందని తెలిపారు. 


ఈ నేపథ్యంలోనే  చలో ఆత్మకూరులో భాగంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన ప్రకాష్ బ్యారేజి పైన బైటాయించారు. తమ నిరసనను అడ్డుకోవటం పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన...మనం ఆంధ్రలో ఉన్నామా ...కాశ్మీర్ లో ఉన్నామా అంటూ ట్విట్ చేశారు. ఇదిలా ఉండగా నారాలోకేష్ గృహనిర్బంధం చేయటం తో ప్రజాస్వామ్యంలో ఇదొక చీకటి రోజని ...నిరసన గళాలను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీ ప్రభుత్వ తీరు తుగ్లక్ పాలనకు నిర్శనగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు లోకేష్ .నోవాటెల్ హోటల్ మాజీమంత్రి  అఖిలప్రియను పోలీసులు  హోటెల్లోనే నిర్బంధించారు . దీంతో పోలీసులకు, అఖిలప్రియకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. తన గదిలోకి పర్మిషన్ లేకుండా నేరుగా ఎలా వస్తారంటూ పోలీసుల పై ఆగ్రహం వ్యక్తం చేసింది అఖిల ప్రియ.కాగా చలో ఆత్మకూరు నేపథ్యంలో గుంటూరులో ఎక్కడ చుసిన ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి.నోవాటెల్ హోటల్ మాజీమంత్రి  అఖిలప్రియను పోలీసులు  హోటెల్లోనే నిర్బంధించారు . దీంతో పోలీసులకు, అఖిలప్రియకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. తన గదిలోకి పర్మిషన్ లేకుండా నేరుగా ఎలా వస్తారంటూ పోలీసుల పై ఆగ్రహం వ్యక్తం చేసింది అఖిల ప్రియ.


మరోవైపు టీడీపీ తీరును వైసీపీ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. టీడీపీ శిబిరంలో ఉన్నవారందరు పెయిడ్ ఆర్టిస్టులేనని..చంద్రబాబు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ శ్రేణులపై జరిగిన దాడులకు బాబు బాధ్యులు కాదా అని ప్రశ్నించారు. ఇప్పటికైన గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి టీడీపీ సహకరించాలని..దీనిపై ఎలాంటి రాజకీయం చేయొద్దని హితవు పలికారు.    


మరింత సమాచారం తెలుసుకోండి: