పాలనాడులో పరిస్థితులు క్రమంగా చేయిదాటి పోతున్నాయి.  ఎక్కడికక్కడ పోలీసులు నేతలను అరెస్ట్ చేస్తున్నారు.  బారికేడ్స్ ఏర్పాటు చేసి కంట్రోల్ చేస్తున్నారు.  పాలనాడులోకి ఎవరిని ఎంటర్ కానివ్వడంతో లేదు.  అంతేకాదు.. ఆ ఏరియాలో 144 వ సెక్షన్ అమలులో ఉండటంతో.. టిడిపి నేతలు మండిపడుతున్నారు.  జమ్మూ కాశ్మీర్ లో ఉన్న పరిస్థితులను ఏపీలో ప్రభుత్వం అమలు చేస్తోందని మండిపడింది.  


జమ్మూ కాశ్మీర్ ను విలీనం చేసే సమయంలో అక్కడ ఇలానే 144 వ సెక్షన్ అమలు చేశారు.  అయితే, దేశంలో ఎక్కడ ఎలాంటి గొడవలు జరిగినా ఇలా 144 సెక్షన్ అమలు చేస్తారని గతంలో బీజేపీ నేతలు చెప్పిన సంగతి తెల్సిందే.  పోలీసులు, ఆర్మీ కూడా ఈ విషయం చెప్పారు.  దానికి ఇప్పుడు ఓ ఉదాహరణ పలనాడు అని చెప్పాలి.  గొడవలు జరుగుతుండటంతో.. ఇక్కడ 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.  


అయితే, టీడీపీ తలపెట్టిన చలో ఆత్మకూరు విషయంపై వైకాపా సీనియర్ నేత విజయసాయి రెడ్డి స్పందించారు.  యరపతినేని, కోడెల, అయన కుమారుడిని కాపాడేందుకే తెలుగుదేశం పార్టీ పాలనాడులో ఇలాంటి ఎత్తులు వేస్తోందని, టాపిక్ డైవర్ట్ చేస్తుందని మండిపడ్డారు. టాపిక్ డైవర్స్ చేయడం వలన తప్పించుకోవచ్చని చూస్తున్నారని అన్నారు.  


అలా ఎన్నటికీ సాధ్యం కాదని, చట్టం తనపని తాను చేసుకుంటూ వెళ్తుందని అన్నారు.  చంద్రబాబు దృష్టిలో పేదలంటే యరపతినేని, కోడెల,అయన కుమారులే అని చెప్పి అన్నారు.  కావాలనే పాలనాడులో అలజడులు సృష్టిస్తున్నారని, జగన్ తీసుకుంటున్న అభివృద్ధి నిర్ణయాలను పక్కదోవ పట్టించేందుకే ఇలా చేస్తున్నారని అన్నారు.  ఇప్పటికే దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రుల విషయంలో జగన్ రెండో స్థానంలో ఉన్నారని అభివృద్ధికి నిదర్శనం ఇదే అని అయన అన్నారు.  పచ్చగా, చల్లగా, ప్రశాంతంగా ఉన్న పలనాడు ఒక్కసారిగా అలజడులో పెట్రేగిపోవడంతో సామాన్యజనం ఇబ్బందులు పడుతున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: