Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Sep 17, 2019 | Last Updated 6:06 am IST

Menu &Sections

Search

మొత్తానికి చింతమనేని అరెస్టయ్యారు

మొత్తానికి చింతమనేని అరెస్టయ్యారు
మొత్తానికి చింతమనేని అరెస్టయ్యారు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలుగుదేశంపార్టీ మాజీ ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్టు చేశారు. అంటే ఈ అరెస్టుకు చలో ఆత్మకూరు కార్యక్రమానికి సంబంధం లేదు లేండి. చింతమనేని పై దాదాపు 15 రోజుల క్రితం ఎస్సీ వేధింపుల చట్టం క్రింద ఓ కేసు పెట్టారు పోలీసులు. విచారణకు రమ్మని చెబితే అరెస్టు భయంతో తప్పించుకు తిరుగుతున్నారు అప్పటి నుండి.

 

గడచిన 15 రోజులుగా పోలీసుల నుండి తప్పించుకుని ఎక్కడెక్కడో తిరిగారు. చివరకు ఏమనుకున్నారో ఏమో ? ఎక్కువ రోజులు పోలీసులను నుండి తప్పించుకుని తిరగటం సాధ్యం కాదని అనుకున్నట్లున్నారు. ఎందుకంటే నియోజకవర్గాన్ని అయిన వాళ్ళను వదిలేసి ఎన్ని రోజులని చింతమనేని మాత్రం తిరుగుతారు. అందుకనే చివరకు ఈ రోజు పోలీసుల ముందు ప్రత్యక్షమవ్వాలని అనుకున్నారు.

 

ఎప్పుడైతే చింతమనేని తన ఇంట్లో ఉన్నారని తెలిసిందో వెంటనే పోలీసులు వెళ్ళి మాజీ ఎంఎల్ఏని అరెస్టు చేశారు. దాంతో పరారీలో ఉన్న టిడిపి మాజీ ఎంఎల్ఏల్లో ఒకళ్ళని పోలీసులు అరెస్టు చేసినట్లైంది. విచిత్రమేమిటంటే చింతమనేనిపై ఫిర్యాదు చేస్తే కనీసం కేసు నమోదు చేసుకోవటానికి కూడా ఓ మహిళా ఎసై ఇష్టపడలేదు.  ఆ విషయం వెలుగు చూడగానే ఉన్నతాధికారులు సదరు మహిళా ఎసైని వెంటనే విధుల నుండి తప్పించారు కూడా.

 

ఇక అధికారంలో ఉండగా చింతమనేని చేసిన అరాచకాలకు, దాష్టికాలకు అంతే లేదు. ఎవరిని పడితే వాళ్ళని కొట్టేవారు. అప్పట్లో ప్రతిపక్షం వైసిపి నేతలని లేదు చివరకు అధికారులని కూడా చూడలేదు. బహిరంగ సభల్లో కూడా నోటికొచ్చినట్లు అధికారలను బండబూతులు తిట్టిన సందర్భాలున్నాయి.

 

తనపై ఎన్ని కేసులు నమోదైనా చింతమనేని లెక్క చేయలేదు. ఎప్పటికి టిడిపినే అధికారంలో ఉంటుందని, తానే ఎంఎల్ఏగా ఉంటానని అనుకున్నట్లున్నారు. అలాంటిది మొన్నటి ఎన్నికల్లో పార్టీతో పాటు తాను కూడా ఓడిపోవటంతో చింతమనేని బాధితులంతా ఒక్కొక్కరుగా బయటకు రావటం మొదలుపెట్టారు. అంతా కలిసి ఇపుడు పోలీసులకు ఫిర్యాదులు ఇస్తుంటే చింతమనేనికి కష్టాలు మొదలయ్యాయి. విచిత్రమేమిటంటే 49 కేసులున్న చింతమనేని లాంటి వాళ్ళని చంద్రబాబు పెంచి పోషించారు.

 

 


police arrested former tdp mla chintamaneni prabhakar
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కోడెల మృతిపై చంద్రబాబు పోస్టుమార్టమ్
కోడెల మృతికి చంద్రబాబు నిరాధరణే కారణమా ?
కోడెల మృతిలో జగనే టార్గెట్టా ?
మృతదేహాలు లాంచిలోనే ఇరుక్కుపోయాయా ?
చంద్రబాబుకు ఎంత కష్టమొచ్చింది ?
బ్రేకింగ్ న్యూస్ : పోలీసుల అదుపులో కన్నా
అమరావతి డెడ్ ఇన్వెస్టిమెంట్ : కెసియర్ సంచలన వ్యాఖ్యలు
పెయిడ్ ఆర్టిస్టులకు ఫుల్లు డిమాండ్
స్నేహితులను విడదీసిన ప్రమాదం
మధ్యలో ఇరుక్కుపోయిన జనసేనాని
సంచలనం : వైవి ఇంట్లో అఘోరాలు
చంద్రబాబు కంట్రోల్లో బిజెపి పని చేస్తోందా ?
చంద్రబాబు మాటలనే రిపీట్ చేసిన పవన్
అవినీతికి మద్దతిస్తున్న జాతీయ మీడియా ?
అమరావతికి డెడ్ లైన్ ఆరు వారాలే
శిబిరంలో పెయిడ్ ఆర్టిస్ట్ కు రూ 10 వేలా ?
జాతీయ మీడియా కూడా జాతి మీడియా అయిపోయిందా ?
చంద్రబాబుకు మరిన్ని షాకులు తప్పవా ?
నేతల్లో భరోసా ఇవ్వలేకపోతున్నారా ?
మీడియా స్వేచ్చ గురించి చంద్రబాబే చెప్పాలి
జగన్ ఆదేశాలను మంత్రులు లెక్క చేయటం లేదా ?
ఏబిఎన్ కు పెద్ద షాక్
చంద్రబాబుకు డిసెంబర్ టెన్షన్
ఎల్లోమీడియానే లేకపోతే పరిస్ధితేంటో ?
ఇంటెలిజెన్స్ రిపోర్టుతో జగన్ షాకయ్యారా ?
బ్రేకింగ్ న్యూస్ : నోరు చేసుకున్న ఫలితం
చంద్రబాబు ఎందుకింత రచ్చ చేశారు ?
పోలీసులు లేకుండా బయట తిరగ్గలరా ?
లోకేష్ నాయకత్వంపై మండిపోతున్న నేతలు
చంద్రబాబుకు ఎంఎల్ఏల షాక్
100 రోజులకే చుక్కలు కనబడుతున్నాయా ?
చలో ఆత్మకూరు : చంద్రబాబుది ఫ్లాప్ షోయేనా ?
చలో ఆత్మకూరు వెనుక అసలు ’కథ’ ఇదేనా ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.