కేసుల కారణంగా కొన్నాళ్లుగా అఙాతంలో ఉన్నారు చింతమనేని ప్రభాకర్. కొద్దిసేపటి క్రితం ఆయన పశ్చిమగోదావరి జిల్లా దుగ్గిరాలకు రావటం జరిగింది. ఆయన భార్య అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరటంతో చూసేందుకు వస్తున్నట్లు ముందుగానే చింతమనేని పోలీసులకు సమాచారం అందించారు. చింతమనేని లొంగిపోతానని కూడా ప్రకటించటంతో భారీగా పోలీసుల్ని మోహరించటం జరిగింది. వచ్చీరాగానే చింతమనేనిని పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
వచ్చిన వెంటనే అరెస్ట్ చేయటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తుంది. చాలా కాలం తరువాత అఙాతం నుండి బయటకు రావటంతో కార్యకర్తలు చింతమనేనిని ఎత్తుకొని ఆనందాన్ని వ్యక్తం చేశారు . చింతమనేని భార్యకు లో బీపీ రావటంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చారని సమాచారం. ప్రస్తుతం ఈమెకు చికిత్స అందుతోంది. వచ్చిన వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈయన ప్రస్తుతం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు. 
 
కొద్దిరోజుల క్రితం చింతమనేని కొంతమందిని దూషించారని చింతమనేని మీద కేసు నమోదు అయింది. కేసుకు సంబంధించిన విచారణకు చింతమనేని హాజరు కావాల్సి ఉంది. ఆయనను అరెస్ట్ చేయటానికి పోలీసులు రంగం సిధ్ధం చేయటంతో చింతమనేని అఙాతంలోకి వెళ్లిపోయారు. నిన్న సాయంత్రం చింతమనేని భార్య అనారోగ్యానికి గురయింది. గత నెల 31 వ తేదీ నుండి చింతమనేని ప్రభాకర్ కనిపించకుండా పోయారు. 
 
పోలీసులు ఆ సమయంలో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పినకడిమి అనే ప్రాంతానికి చెందిన కొందరు యువకులపై చింతమనేని దౌర్జన్యం చేశారనే ఆరోపణలతో పాటు కులం పేరుతో దూషించారని యువకులు పోలీసులకు ఫిర్యాదు చేయటం జరిగింది. చింతమనేనితో పాటు చింతమనేని అనుచరుల పైన కూడా కేసులు నమోదయ్యాయి. ఈ కేసు నమోదైన సమయంలో చింతమనేని కేసులకు భయపడేది లేదని ఎన్ని కేసులు పెట్టుకోవాలనుకుంటే అన్ని కేసులు పెట్టుకోండని వ్యాఖ్యలు చేసి ఆ తరువాత అఙాతంలోకి వెళ్ళారు. 


 
 



మరింత సమాచారం తెలుసుకోండి: