వైసీపీ ప్రభుత్వం వచ్చాక టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని, ఆ దాడులు శృతిమించుతున్నాయి అని, ఆలా టీడీపీ కార్యకర్తలపై దాడులు జరిగిన వాళ్ళు అంత రావాలని గత మూడు రోజులుగా ''ఛలో ఆత్మకూరు'' కార్యక్రమానికి చంద్రబాబు పిలుపినిచ్చాడు. అయితే ఆలా పిలుపునిచ్చిన సమయం నుంచి ఆంధ్ర ప్రదేశ్ లో గొడవలు ప్రారంభమయ్యాయి. 


దీంతో ఈ ఛలో ఆత్మకూరు కార్యక్రమంపై వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు స్పందిస్తూ 'తాము కూడా ఛలో ఆత్మకూరు కార్యక్రమాన్ని చేపడుతున్నామని, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలపైన చాలా దాడులు జరిగాయని, అందరూ కలిసి రండి. మనము ఈ కార్యక్రమం మొదలు పెడుదాం అంటూ వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు పిలుపునిచ్చారు. 


అయితే 'చలో ఆత్మకూరు'కు చంద్రబాబు తన నివాసం నుంచి బయల్దేరుతున్న తనను గృహనిర్బంధం చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. తమ పార్టీ 'చలో ఆత్మకూరు' కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న టీడీపీ నేతల నిర్బంధ కాండపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. ఈ పరిస్థితులు చాలా దారుణమని, దుర్మార్గమని, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గృహ నిర్బంధం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 


ఈ నేపథ్యంలోనే అమరావతిలోని అతని నివాసం నుంచి చంద్రబాబు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి తమ పార్టీ నాయకులను గృహనిర్బంధ చేసారని, వచ్చిన వారిని ఎక్కడికక్కడ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారని, మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అరెస్టు చేసి ఒక పోలీస్‌ స్టేషన్‌ నుంచి మరో పోలీస్‌ స్టేషన్‌కు తిప్పడం మంచి పద్ధతికాదని మండిపడ్డారు. 


ఎవరు ఎంత అడ్డుకున్న 'చలో ఆత్మకూరు' కార్యక్రమం విరమించుకునే ప్రసక్తి లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. మనిషికి జీవించే హక్కు, మాట్లాడే స్వేచ్ఛ, వారి ఆస్తులు, ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని అన్నారు. ఏది ఏమైనా చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని రద్దు చేసుకొనే ప్రసక్తే లేదని తెలిసి చెప్పేశారు.  


మరోవైపు చంద్రబాబుని నివాసం వద్దే హౌస్ అరెస్ట్ చేశారు. ఆత్మకూరుకు వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు ఆయనను వెళ్లనియ్యకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయనకు అనుమతించే వరుకు చంద్రబాబు తన నివాసం వద్ద ఉన్న కారులోనే కూర్చుంట అని తేల్చి చెప్పారు. ఏది ఏమైనా కేవలం 100 రోజుల పాలనపై ఇలాంటి కార్యక్రమాలు చేసి ఆంధ్ర రాష్ట్రానికి ప్రశాంతత లేకుండా చేస్తున్నాడు చంద్రబాబు. 


మరింత సమాచారం తెలుసుకోండి: