'ద బ్లూ పాండ్ ఆఫ్ హొక్కాయిడో' జపాన్ లోని హొక్కాయిడో ద్వీపం సమీపంలో ఒక సరస్సు ఉంది. దీనికి నీలి సరస్సు అని పేరు ఈ సరస్సు ప్రత్యేకత ఏంటంటే ఇదొక ఊసరవెల్లిలా తన నీటి రంగుల్ని మార్చుకుంటుందట. ఒక తీరం వైపు నుండి చూస్తే ఇది నీలి రంగులో కనిపిస్తుంది, అదే ఇంకొక తీరం వైపు నుండి దీనిని చూస్తే ఆకుపచ్చ రంగులో కనువిందు చేస్తుంది. ఇక్కడ విచిత్రమైన విషయమేమిటంటే వర్షాకాలం మొదలవగానే ఈ సరస్సు తనంతట తానే త్వరత్వరగా రంగులు మార్చేసుకుంటోంది.


ఇదొక మానవ నిర్మిత సరస్సు, దీనిని ఒక నదిపై ఆనకట్ట కట్టి సరస్సుగా తయారు చేశారు. శాస్త్ర వేత్తల ఉద్దేశం ప్రకారం నీళ్లలో అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఎక్కువగా ఉండటం వల్లనే ఈ నీళ్లు తమ రంగు మార్చుకుంటుందని చెప్తున్నారు. ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఏ నది నీళ్లతో అయితే ఈ సరస్సుని తయారు చేశారో ఆ నది నీళ్లు సాధారణంగా ఉన్నాయి. కానీ ఈ సరస్సు లోకి వచ్చాక నీళ్ల రంగు ఎందుకు మారిపోతుంది అనే ప్రశ్నకు మాత్రం జవాబు తెలియక శాస్త్రవేత్తలు ఇప్పటికీ జుట్టు పీక్కుంటున్నారు.



ద రింగింగ్ రాక్స్ పెన్సిల్వేనియా లోని ఒక పర్వతం మీద కొన్ని రకాల రాళ్లున్నాయి, అందులో వింతేముంది అనుకుంటున్నారా కానీ ఈ రాళ్లను చూస్తే ఇవి పర్వతానికి సంబంధించినవి కావని ఇట్టే తెలిసిపోతుంది వీటిని బయటి నుండి తెచ్చారేమో అన్నట్టుగా ఉంటాయి. ఇక ఇన్ని రాళ్లని ఈ పర్వతం పైకి ఎవరు తీసుకొచ్చి పెట్టారు అసలు ఇక్కడ ఎందుకు పెట్టారు అనేది అంతుపట్టని, అంతు చిక్కని విషయం ఇక ఇంతకంటే ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ రాళ్లని కొడితే వాటి నుండి రకరకాల సంగీత ధ్వనుల లాంటి శబ్దాలు వస్తాయట.



ఏదైనా ఇనుప వస్తువుతో ఒకే సారి కొన్ని రాళ్లని కొడితే మీకు అద్భుతమైన సంగీత ధ్వనులు వినిపిస్తాయట. ఈ రాళ్ళని  ఒకదానిపై ఒకటి ఒక ప్రత్యేకమైన ఆకృతిలో చేర్చబడ్డాయి. రెండు రాళ్ల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో వచ్చే కంపనం కారణంగానే వీటి నుండి సంగీత శబ్దాలు వస్తున్నాయని మనం కొంతవరకు ఊహించవచ్చు. కానీ ఈ ప్రత్యేకమైన శైలిలో ఈ రాళ్లని ఎవరు అమర్చి ఉంటారనేది పెద్ద ప్రశ్న, దీనికి సమాధానం ఎవరి దగ్గరా లేదు. ఇక ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రాళ్ల శబ్దం కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అంటే చలికాలంలో ఒకలాగా ఎండాకాలంలో మరో విధంగా ధ్వనులు వస్తాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: