ఏపీలో మూడు నెలల తేడాలోనే రాజకీయం ఘాటెక్కింది. సీన్ సేమ్ టూ సేమ్  అయితే పాత్రలు మాత్రం మారిపోయాయి. ఇపుడు సీఎం కుర్చీలో జగన్ ఉంటే చంద్రబాబు విపక్ష పాత్రలోకి మారారు. చంద్రబాబు జగన్ని ఉక్కిరిబిక్కిరి చేయాలనుకుంటున్నారు. అందుకోసం ఆయన మాటల నుంచి చేతలకు సిధ్ధమవుతున్నారు. అందులో మొదటిగా చలో ఆత్మకూర్ శాంపిల్ చూపించారు. దానికి తగినట్లుగా జగన్ సర్కార్ కూడా రియాక్ట్ అయి శాంపిల్ మార్క్ పాలన చూపించింది.


ఇదిలా ఉండగా ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎవరు సక్సెస్ అయ్యారు అంటే ఇద్దరూ అని ఓ వైపు వినిపిస్తూంటే ఇద్దరూ కాదని మరో వైపు వినవస్తోంది. చంద్రబాబు ఒక గ్రామం గొడవను కాస్తా రాష్ట్ర వ్యాప్త అంశంగా చేయడం వరకూ సక్సెస్ అయ్యారు. అయితే సున్నితమైన పలనాడు ప్రాంతంలో రాజకీయాలను చేయడం వల్ల లాభం కంటే నష్టమే ఉంటుందని అంటున్నారు. చంద్రబాబు లాంటి సీనియర్ నేత తీసుకోవాల్సిన సమస్య ఇది కానే కాదన్న మాట వినిపిస్తోంది. పైగా ఆయన జగన్ సర్కార్ విషయంలో వేచి చూసే ధోరణిలో లేరన్న విషయమూ బయటపడుతోందని అంటున్నారు.


చంద్రబాబు గ్రామాలకు వెళ్తే ఉద్రిక్త పరిస్థితులు తప్ప మరేమీ జరగవు. ఆ సంగతి తెలిసి కూడా అయన చలో ఆత్మకూర్ అని పిలుపు ఇవ్వడం అంటే ఓ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి స్థాయికి తగదన్న మాట వినిపిస్తోంది. కేవలం పొలిటిక‌ల్ మైలేజ్ కోసమే దీన్ని వాడుకున్నారన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఒక గ్రామంలో గొడవలు ఉంటే వాటిని పరిష్క‌రించుకునేందుకు అక్కడ నాయకులకు సలహాలు ఇవ్వాలి. పోలీస్ ఫిర్యాదుల ద్వారా దాన్ని సక్రమ మార్గంలో పని అయ్యేట్లుగా చూసుకోవాలి. కానీ బాబు దాన్ని కూడా రాజకీయం చేయడమే దారుణం అంటున్నారు. మొత్తానికి బాబు ఈ ఎపిసోడ్ ఆధారంగా పార్టీలో ఓ రకమైన రీచార్జ్  చేసుకోగలిగారు. క్యాడర్ ని బూస్టప్ చేసుకోగలిగారు. ఇకపై మరిన్ని చలో ఆత్మకూర్ ఎపిసోడ్లు జరుగుతాయని కూదా బాబు చెప్పకనే చెబుతున్నట్లైంది.


ఇక జగన్ విషయానికి వస్తే ఆయన అప్పట్లో బాబు మాదిరిగానే ఉక్కుపాదంతో దీన్ని అణచాలనుకున్నారు. అయితే దాని వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు తప్పితే మరేమీ రాదన్న మాట వినిపిస్తోంది. చలో ఆత్మకూరు అన్న బాబుని అలాగే వదిలేసి ఉంటే ఇంతలా మీడియాలో హైలెట్ అయ్యేది కాదని, ఒక్క అనుకూల మీడియాలోనే ఆ న్యూస్ వచ్చేదని అంటున్నారు. ఇపుడు బాబు పార్టీకి ప్రచారం దండిగా రావడానికి హౌస్ అరెస్టులే ఎక్కువగా ఉపయోగపడ్డాయని అంటున్నారు. మొత్తం మీద జగన్ సైతం ఇకపై టీడీపీ ఏ ఆందోళన చేపట్టినా కూడా  ఉక్కుపాదంతో అణచేస్తామని తాజా ఎపిసోడ్ తో చెప్పినట్లైంది.



మరింత సమాచారం తెలుసుకోండి: