ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని ఏలిన సీనియ‌ర్ సీఎంగా కీర్తిగ‌డించిన చంద్రాలుకు ఇప్పుడు ప‌గ‌లే చుక్క‌లు క‌నిపిస్తున్నాయా... అస‌లు అధికారం పోయింద‌నే అస‌హానంతో ఊగిపోతూ ఆవేశంలో ఏమి మాట్లాడుతున్నాడో.. ఏమి ప‌నులు చేస్తున్నాడో అంతు చిక్క‌కుండా ఉంది. అస‌లు చంద్రాలు ఇప్పుడు టీడీపీని బ‌లోపేతం చేయ‌డం మ‌రిచి అన్ని పాత విమ‌ర్శ‌ల‌నే మ‌ళ్ళీ మ‌ళ్ళీ చేస్తూ అధికారం కోల్పోయిన బాధ‌ను వ్య‌క్తం చేస్తున్నాడనే నిజాన్ని ఒప్పుకోక‌త‌ప్ప‌దు. వాస్త‌వానికి చంద్ర‌బాబు నాయుడు త‌న కొడుకంత వ‌య‌స్సున్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీఎంగా ఉంటే.. తాను మాత్రం ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉండ‌లేక పోతున్న‌ట్లు ఉన్నాడు. 


అందుకే తాను ప‌రిపాల‌న చేస్తున్న‌ప్పుడు చేసిన త‌ప్పుల‌ను కూడా మ‌రిచి ఇప్పుడు జ‌ర‌గ‌ని త‌ప్పుల‌ను జ‌రిగిన‌ట్లు ప‌దే ప‌దే ఆరోప‌ణ‌లు చేస్తూ అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నాడు.. అందుకే చంద్రాలు చేస్తున్న పోరాటాలు, ఆరోప‌ణ‌లు ప‌స‌లేకుండా పోతున్నాయి. అందుకే చంద్రాలుకు జ‌నాలు మార్కులు వేయ‌లేక పోతున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో చ‌ర్చ‌నీయాంశంగా రంజుగా సాగుతున్న రాజ‌కీయం ఏదైనా ఉందా అంటే అది ప‌ల్నాడు రాజ‌కీయమే. వాస్త‌వ ప‌రిస్థితుల‌ను బేరీజు వేసుకోకుండానే చంద్ర‌బాబు నాయుడు గుడ్డెద్దు చేల్లో ప‌డ్డ‌ట్లుగా రాజ‌కీయ ఆరోప‌ణ‌లు చేస్తుండ‌టంతో జ‌న‌మంతా విస్తుపోతున్నాడు. వాస్త‌వానికి ప‌ల్నాడులో చంద్రబాబూ హయాంలో పల్నాడు ప్రాంతంలో రాక్షస పాలన సాగిన సంగతి మర్చిపోయిన‌ట్లున్నాడు. 


మాజీ స్పీకర్‌ కోడెల కుటుంబం కే. ట్యాక్స్‌ పేరుతో చేసిన దందాలు, ఆరాచ‌కాలు అంతా ఇంతా కాద‌ని స్వయంగా టీడీపీ నేత‌లే ఆందోళ‌న‌లు చేశారంటే కోడెల ఎలాంటి దుశ్చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ్డారో అర్థ‌మ‌వుతుంది. ఇక మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీ‌నివాస‌రావు  మైనింగ్‌ పేరుతో పల్నాడును దోచుకోవ‌డ‌మే కాకుండా అక్క‌డి ప్ర‌జ‌ల‌ను పీల్చిపిప్పి చేశాడ‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మ‌రి  అక్కడి ప్రజలు అన్యాయాలకు గురైనప్పుడు, ఊళ్లొదిలి వెళ్ళీ పోయిన సంఘ‌ట‌న‌లు కోకొల్ల‌లు. మ‌రి కోడెల ఆరాచ‌కాలు, య‌ర‌ప‌తినేని అక్ర‌మాలు జ‌రిగిన‌ప్పుడు చంద్ర‌బాబు నాయుడు ఎందుకు నోరు  మూగబోయి ఉంటుంది అనే ప్ర‌శ్న‌ను ఇప్పుడు జ‌నాలు వేస్తున్నారు. 


అంతే తాను అధికారంలో ఉన్న‌ప్పుడు త‌న నేత‌లు ఎన్ని ఆరాచ‌కాలు చేసిన స‌మ్మ‌తమే అన్న‌ట్లు కామ్‌గా ఉన్న చంద్ర‌బాబు నాయుడు ఇప్పుడు మాత్రం ఎందుకు వాటిపై గ‌గ్గోలు పెడుతున్నాడు అంటూ జ‌నాలు చంద్రాలును దుమ్మెత్తిపోస్తున్నారు. చంద్ర‌బాబు అధికారంలో ఉన్నప్పుడు కోడెల, యరపతినేని వంటి వారు తమ మాట విననందుకు ఎందరినో గ్రామ బహిష్కరణ చేయించారని, చివరకు ఎన్నికల్లో ఓట్లు కూడా వేయనివ్వలేదని అది చంద్రాలు కు గుర్తు లేకుండా పోయిందా అనే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. అంటే తాను చేస్తే సంసారం.. ఇత‌రులు చేస్తే వ్య‌భిచారం అన్న‌ట్లుగా ఇప్పుడు చంద్రాలు ప‌రిస్థితి ఉంద‌ని తెలుగుత‌మ్ముళ్ళు కూడా న‌వ్వుకుంటున్నారు. ఏదేమైనా ప‌ల్నాడులో జ‌రుగుతున్న వ్య‌వ‌హారంతో చంద్రాలుకు రాజ‌కీయంగా మైన‌స్సే అవుతున్న ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: