చింతమనేని రెచ్చిపోయారు, మంత్రి బొత్స వ్యాఖ్యలతో ఊగిపోతున్నారు. పారిపోలేదు, దమ్ముంటే అరెస్ట్ చేసుకోండంటూ మంత్రి బొత్సకు సవాల్ విసురుతున్నారు. పినకడిమిలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన చింతమనేని నేరం చెయ్యునప్పుడు పారిపోవడం ఎందుకు దమ్ముంటే పోలీసులకు లొంగిపోవాలంటూ బొత్స విసిరిన సవాల్ ను స్వీకరించిన చింతమనేని నేను వెలుగు లోకి వస్తున్నా చూడు అంటున్నారు.

ఇంతకీ చింతమనేని ఇంతలా రెచ్చిపోడానికి కారణమేంటి, ఎస్పీ ఆఫీస్ కు వస్తున్నా కాస్కో దమ్ముంటే అరెస్టు చేసుకో అని సవాల్ విసరటానికి కారణం ఏంటి.అజ్ఞాతంలో ఉన్న చింతమనేని ఇంతలా ఎందుకు ఆవేశపడుతున్నారు అంటే మంత్రి బొత్సనే అసలు కారణమని చెప్పాలి. నేరం చెయ్యనప్పుడు ఎందుకు పారిపోయావన్న బొత్స వ్యాఖ్యలు చింతమనేనిని రెచ్చగొట్టాయనే చెప్పాలి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇసుక ర్యాంప్ ల వ్యవహారంలో కులం పేరుతో దూషించాడంటూ కొందరు పినకమిడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అప్పటి నుంచి అజ్ఞాతంలోనే ఉన్నారు చింతమనేని.

ఇప్పటి వరకు వెలుగులోకి రాలేదు. ఇటు చింతమనేని కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. చింతమనేని అదృశ్యంపై ఇటు పొలిటికల్ డైలాగ్స్ వార్ కూడా కొనసాగుతోంది. చింతమనేని వ్యాఖ్యల తరువాత పోలీసులు అలర్టయ్యారు, ఏ క్షణంలో నైనా చింతమనేని అజ్ఞాతం వీడే అవకాశముండటంతో అతని ఇంటిని చుట్టుముట్టారు.చింతమనేని ఇంట్లో సోదాలు కూడా చేస్తున్నారు. అయితే అక్కడ భారీ ఎత్తున చేరుకున్న చింతమనేని అనుచరులు నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దుగ్గిరాలలో ఆయన ఇంటిని పోలీసులు ఒక్కసారిగా సోదా చేసేందుకు రావటంతో ఇక్కడ ప్రతిఘటించినటువంటి పరిస్థితి ఉంది. గత వారం రోజుల నుంచి చింతమనేని ప్రభాకర్ అజ్ఞాతంలో ఉన్నారు.

పెదవేగి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అయిన అట్రాసిటీ కేసులో ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఆయన కోసం గత వారం రోజులుగా గాలిస్తున్నారు. అయితే వారం రోజులుగా అజ్ఞాతంలో ఉన్న ప్రభాకర్ ఈ రోజు ఎస్పీ ఆఫీసుకు వస్తాను తాను ఏదైనా నేరం చేస్తే శిక్ష అనుభవించటానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పిన సందర్భంలో పోలీసులు ఒక్కసారిగా ఆయన ఇంటిని చుట్టుముట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: