గత కొద్ది గంటలుగా పల్నాడు మరియు ఆత్మకూరు గ్రామాలలో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ప్రభుత్వం అక్కడ సెక్షన్ 144 ని అమలు చేసింది. టిడిపి మరియు వైసీపీ తమ సొంత ర్యాలీలను ప్రకటిస్తే… జగన్ మాత్రం అక్కడ ర్యాలీని జరగకుండా విశ్రమించమని చెప్పి ముందు లా అండ్ ఆర్డర్ సక్రమంగా జరిగేటట్లు సన్నాహాలు చేస్తున్నాడు. అయితే టిడిపి తమ కార్యకర్తల మీద దాడి జరిగిందని చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్న వైసీపీ ప్రభుత్వం పరిస్థితులను దారిలోకి తెచ్చేందుకు కొంతమంది టిడిపి నేతలను అరెస్టు చేస్తున్నారు. వీరు రౌడీయిజంకి దిగినట్లు అక్కడ పోలీసులు చెబుతున్నారు. వారిలో ఇప్పటికే ఎన్నో అవినీతి మరియు హింసాత్మక ఆరోపణలు ఎదుర్కొంటున్న చింతమనేని కూడా ఉన్నారు.

ఇకపోతే తెలుగుదేశం ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న సమస్యను తీవ్రత చేద్దామని చూస్తుండగా పోలీసులు గొడవలన్నీ ఆపేందుకు చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. ఈ మధ్యలో గాయాలపాలైన వైసిపి బాధితులను వాళ్ల సొంత ఊర్లకు తరలించేలా సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ గొడవల్లో ప్రాణ నష్టం మరియు ఆర్థిక నష్టం జరిగిన తరుణంలో ప్రభుత్వం ఇక పై ఎలాంటి డ్యామేజ్ జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వైసిపి బాధితులను తమ సొంటూర్లకి తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రకాశం మరియు గుంటూరు జిల్లాలను తాకే పల్నాడు, మార్కాపురం మరియు గురజాల ప్రాంతాలలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీంతో అక్కడ ఉన్న జనాలను అదుపు చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

అసలు ఈ గొడవంతా గత వారం మొదలైంది. గతవారం టిడిపి గుంటూరులో ఒక రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయగా అక్కడి తెదేపా నేతలు చెబుతున్న దాని ప్రకారం అధికారంలో ఉన్న వైసిపి పార్టీ కార్యకర్తలు వారిపై దాడికి పాల్పడ్డారట. అక్కడితో ఆగకుండా ఇంకా ముందుకు వెళ్ళి గడిచిన 100 రోజులుగా అక్కడి గ్రామాల నుంచి వైసిపి వారు టిడిపి పార్టీ కార్యకర్తలను ఊరు నుంచి వెళ్లగొడుతున్నారని అన్నారు చంద్రబాబు. ఇలాంటి ఎన్నో నమ్మశక్యం గాని ఆరోపణలు చేస్తున్న టిడిపి నేతలను శాంతిభద్రతలను కాపేడేందుకు ప్రభుత్వం ప్రస్తుతానికి అరెస్ట్ చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: