ఆంధ్ర ప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసే అభివృద్ధి చూడలేక కేవలం 100 రోజుల పాలనకే తుగ్లక్ పాలన అంటూ ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు ప్రతిపక్ష పార్టీ అయినా తెలుగు దేశం పార్టీ. మొన్నటి వరుకు వరదలు అని విమర్శలు చేస్తే నిన్న ఇసుక అంటూ విమర్శలు చేశారు. ప్రస్తతం అన్ని సక్రమంగా ఉండే సరికి అది భరించలేక పల్నాడులో చలో ఆత్మకూరు అంటూ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. 


వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, ఆ బాధితులు అంత రావాలని చంద్రబాబు పిలుపిచ్చారు. అయితే ఆ కార్యక్రమాన్ని ఆపడానికి పోలీసులు అష్టకష్టాలు పడుతున్నారు. చంద్రబాబు నాయుడుని, నారా లోకేష్ ని గృహ నిర్బంధంలో వుంచారు. అయినప్పటికీ ఒకసారి చంద్రబాబు నిరాహార దీక్ష అంటే మరోసారి నేను కారు నుంచి దిగే ప్రసక్తే లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. 


అయితే ఇవి అన్ని పక్కన పెడితే ఇప్పుడు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి తెరపైకి వచ్చారు. మొన్న ఎప్పుడో విజయసాయి రెడ్డి అన్నట్టు సుజనా చౌదరిలో ఇంకా పచ్చ రక్తం అలానే ఉంది. అందుకే ఇప్పుడు సుజనా చౌదరి కాషాయరంగులో ఉన్న పచ్చ మాటలే మాట్లాడుతున్నారు. అయితే వైఎస్ జగన్ 100 రోజుల పాలనపై సుజనా చౌదరి విమర్శలు గుప్పించారు. 


సుజనా చౌడరీ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం తీరుతో ఏపీకి తీరని నష్టం అని, ప్రత్యర్థులపై కక్ష తీర్చుకున్నట్లు పాలన ఉందని సుజనా చౌదరి ఆరోపించారు. రాష్ట్రాన్ని నాశనం చేసి ప్రజలను ఇబ్బంది పెట్టద్దు అని, 13 జిల్లాల్లో ప్రత్యర్థులను వైసీపీ ఇబ్బంది పెడుతోందిని ఆరోపించారు. అయితే ప్రత్యర్థుల ఆరోపణలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని,


పోలీస్ వ్యవస్ధను రాజకీయ నాయకులూ చేతుల్లోకి తీసుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఇలా చేస్తే బీజేపీ ఊరుకోదు అని మొదట పచ్చ మాటలు మాట్లాడిన చివరికి కాషాయం మాట్లాడుతున్నట్టు వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు సుజనా చౌదరి. మరి సుజనా చౌదరి విమర్శలపై వైసీపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: