జమిలి ఎన్నికలపై మాట్లాడేంత స్ధాయి చంద్రబాబునాయుడుకు లేదని తేలిపోయింది. చంద్రబాబుకు ఎంత స్ధాయి ఉందో చెప్పింది కూడా ఎవరో కాదు. ఒకపుడు ఆయనకు నమ్మకస్తుడు, బినామీ అనే ప్రచారంలో ఉన్న ఫిరాయింపు రాజ్యసభ  ఎంపి సుజనా చౌదరి. చంద్రబాబు స్ధాయి గురించి స్వయంగా  సుజనానే తేల్చేయటం టిడిపి, బిజెపిల్లో తీవ్రంగా చర్చ జరుగుతోంది.

 

అసలు చంద్రబాబు లేకపోతే సుజనా అనే వ్యక్తే ఉండే వాడు కాదన్నది నిజం. ప్రత్యక్ష రాజకీయాల్లో ఏనాడు పనిచేయని, పోటి చేయని సుజనా ఎప్పుడూ తెరవెనుక రాజకీయమే చేస్తుంటారు. ఏదో ఆర్ధికంగా బలవంతుడు అన్న ఏకైక కారణంతోనే చంద్రబాబుకు సన్నిహితునిగా మారిపోయారు. దాంతోనే పార్టీ నేతలపై ఆధిపత్యం చెలాయించేవారు టిడిపిలో ఉన్నపుడు.

 

ఆర్ధిక కారణాలతోనే పార్టీలో కీలకంగా మారిన  సుజనా రాజ్యసభ ఎంపి అయ్యింది కూడా అదే కారణంతో. చివరకు కేంద్రంలో మంత్రి పదవి దక్కటానికి కారణం కూడా అదే కావటం విచిత్రం. పీకల్లోతు ఆర్ధిక అవకతవకల్లో ఇరుక్కున్నా కూడా చంద్రబాబు కేంద్రంలో మంత్రి పదవికి సిఫారసు చేశారంటే అర్ధమేంటి ?  దాదాపు రూ. 9 వేల కోట్లకు బ్యాంకులను ముంచిన ఘన చరిత్ర ఈ సుజనాది.

 

రాష్ట్రంలో అధికారం కోల్పోగానే చంద్రబాబు సూచనల మేరకు భవిష్యత్తు కోసం బిజెపిలోకి ఫిరాయించారు. కారణాలు ఏవైనా కానీండి అప్పటి నుండి చంద్రబాబును అక్కడక్కడ వ్యతిరేకించటం మొదలుపెట్టారు. లేకపోతే బిజెపిలోనే ఉన్నా నరేంద్రమోడి కన్నెర్ర చేస్తే చిదంబరానికి పట్టిన గతే పడుతుందని బాగా తెలుసు ఈయనకు.

 

మూడేళ్ళల్లో జమిలి ఎన్నికలు వస్తాయని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు సుజనా కౌంటర్ ఇచ్చారు లేండి. చంద్రబాబు కేవలం ఎంఎల్ఏ మాత్రమే కాబట్టి పార్లెమెంటు ఎన్నికల గురించి మాట్లాడే స్ధాయి లేదని సుజనా తేల్చేశారు.  మొత్తానికి చంద్రబాబు స్ధాయి ఏమిటో సుజనా తేల్చేయటమే ఇక్కడ అన్నింటికన్నా విచిత్రం.

 

 

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: