మాతృత్వం కోసం ఎందరో అలమటిస్తున్నారు.కొందరైతే డబ్బులు ఖర్చుపెట్టి మరీ పిల్లలను కొనుక్కొనగా,మరికొంతమంది అద్దెగర్భాలతో మాతృత్వాన్ని పొందుతున్నారు. ఇంతలా పిల్లలకోసం కష్టపడేవారిని చూస్తున్న ఈ సమాజంలో ఓ తల్లి తన జల్సాల కోసం కన్నబిడ్డల్నే అమ్మేసింది.ఒక్కోసారి అనిపిస్తుంది ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు,మనకంటే పక్షులు, జంతువులు నయమని,కనీసం అవి వాటిపిల్లలు నడకనేర్చుకొనే వరకైన వాటిని కంటికి రెప్పలా కాపాడుతాయి.కాని మనుషులు కొందరు కంటిపాప తెరవకముందే పసివాళ్లను చిదిమేయడమో,అనాధలను చేయడమో,లేక అమ్మడమో చేస్తున్నారు.ఇలాంటి ఘోరాలు చూస్తున్నప్పుడు మారుతున్న అమ్మతనం, ముందు ముందు తరాలకు ఓ మచ్చలా మిగలడం ఖాయమంటున్నారు.ఇకపోతే ఓ తల్లి తన అవసరాలకోసం కన్న పిల్లలను అమ్మేసి క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించి మిగతా డబ్బుతో మొబైల్ కొనుగోలు చేసింది.కానీ,ఏం లాభం,చివరకు జైల్లో ఊచలు లెక్కిస్తోంది..ఇంతకు ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం.



చైనాలోని,జెజియాంగ్ రాష్ట్రంలోని,"మా" అనే మహిళకు కవల పిల్లలు పుట్టారట.వారిని పెంచడం ఆమెకు భారం అనిపించి దేమో,అందుకే ఆ కవల పిల్లలను వేర్వేరు వ్యక్తులకు అమ్మేసింది.వచ్చిన డబ్బులతో క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించి,మిగిలిన సొమ్ముతో కొత్త మొబైల్ కొన్నది."మా" భర్త "వూ "కుటుంబాన్ని పట్టించుకోక జూదం ఆడుతూ భారీగానే అప్పులు చేశాడు. ఈవిడకేమో జల్సాలు ఎక్కువ దీంతో ఆ బిడ్డలను అమ్మేసింది.ఇదంతా ఒకెత్తైతే ఇప్పుడు ఇంకా ఆశ్చర్యం కలిగించే మరో ట్విస్ట్.ఈమె చేసిన పని,"మా" భర్తకు తెలిసి చాల కోపంతో తనతో గొడవకు దిగాడు.ఇంతకు అతను గొడవకు దిగింది పిల్లలను అమ్మేసినందుకు కాదు,పిల్లలను అమ్మగా వచ్చిన డబ్బులో తనకు వాటా ఇవ్వనందుకు.దీంతో"మా"తను డబ్బులను ఎలా ఖర్చుచేసింది చెప్పింది.తన దగ్గర రూపాయి కూడ మిగలలేదని ఇప్పుడు ఏం చేసుకుంటావో చేసుకొమ్మని అరచింది.



దీంతో గొడవ చిలికి చిలికి గాలి వానలా మారి,చివరకు కేసు పోలీసుల వరకు వెళ్లింది.పోలీసులు దంపతులిద్దరిని అరెస్టు చేసి విచారణ జరిపిన వారికి తెలిసిన నిజం విని షాక్ తిన్నారు."మా"కు పుట్టిన కవల పిల్లలను రెండు వారాల వయస్సు నిండ కుండానే అమ్మేసిందని,కనీసం ఆ పిల్లలను కొనుగోలు చేసిన వ్యక్తుల వివరాలేవీ ఆమె తెలుసు కోలేదని,తెలిపారు.ఇక చైనా చట్టాల ప్రకారం,చిన్నారులను అక్రమంగా తరలించడాన్ని నేరం కింద పరిగణిస్తారు.అలా చేసిన దోషులకు కనీసం పదేళ్ల జైలు శిక్ష విధిస్తారు. అంతేకాకుండా పిల్లలను అమ్మిన తల్లిదండ్రులతోపాటు,వారిని కొనుగోలుచేసిన వ్యక్తులకు కూడా శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి.కాగా ఆ దంపతులు ఇంకా పోలీసు కస్టడీలోనే ఉన్నారు.ఈ ఘటనపై కోర్టు త్వరలోనే తీర్పు వెల్లడించనుందని పోలీసులు తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి: